నయనతారపై గౌతమ్ మీనన్ ప్రశంసలు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగులో 'అనామిక' తరువాత మరో సినిమాకి సంతకం చేయకపోయినా.. తమిళనాట మాత్రం ఫుల్ బిజీగా మారింది నయనతార. తని ఒరువన్, మాయ.. తాజాగా నానుమ్ రౌడీదాన్.. ఇలా వరుసగా మూడు విజయాలను పొందింది ఈ కేరళ కుట్టి. 'నానుమ్ రౌడీదాన్'లో నయనతార నటనకి ప్రేక్షకులు, విమర్శకులు ఫిదా అయిపోయారు.
అంతేనా.. ప్రముఖ తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ అయితే నయనతారని ఓ పవర్ హౌస్ అని వర్ణించడమే కాకుండా.. స్ట్రయికింగ్ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చిన నయన నటిగా మరోసారి సత్తా చాటిందని ప్రశంసలు కురిపిస్తున్నాడు. ఈ తీరు చూస్తుంటే.. నయన హీరోయిన్‌గా గౌతమ్ ఓ సినిమా తీసే అవకాశం లేకపోలేదని కోలీవుడ్ జనాలు ముచ్చటించుకుంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments