బ్లాక్ బస్టర్ హీరోతో గౌతమ్ మీనన్
Send us your feedback to audioarticles@vaarta.com
కొత్తదనానికి పెట్టింది పేరు దర్శకుడు గౌతమ్ మీనన్. డిఫరెంట్ ఫిల్మ్స్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన ఈ దర్శకుడు ప్రస్తుతం నాగచైతన్యతో 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సినిమాని తమిళంలో శింబుతోనూ ఏకకాలంలో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత గౌతమ్ చేయబోయే సినిమా గురించి రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా వినిపిస్తున్న కథనం ఏమిటంటే.. 'తని ఒరువన్' వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ని కొట్టిన జయం రవితో గౌతమ్ తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడన్నది. బహుశా.. ఈ సినిమా తెలుగు వెర్షన్లో రామ్‌చరణ్ హీరోగా నటించే అవకాశముండొచ్చని కోలీవుడ్‌లో కథనాలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో ఏ మాత్రం నిజముందో త్వరలోనే తెలుస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments