AP Schemes: ఏది ఉచితం.. ఏది సంక్షేమం..? కడుపునిండిన వాడికి ఏం తెలుసు..?
Send us your feedback to audioarticles@vaarta.com
కడుపునిండిన వాడికేం తెలుసు కడుపు మండేవారి కష్షాలు. సిటీబస్సులు, పాసింజర్ రైళ్లలో కిక్కిరిసి ప్రయాణం చేసే వారి కష్టాలు.. లగ్జరీ కార్లలో తిరిగే వారికేం తెలుసు. ప్రతి నాణేనికి బొమ్మబొరుసు ఉన్నట్లు.. ప్రతి విషయంలోనూ మంచి, చెడులు ఉంటాయి. ఒకడి కష్టాలు మరికొరకి నవ్వులాటగా ఉంటాయి. ఒక్కరు ఏం ఆశించకుండా ఆపదలో ఉన్న వారికి సాయం చేస్తారు.. మరికొందరు ఆ సాయానికి కూడా వక్రబుద్ధి జోడిస్తారు.
ఇవి పథకాలు కాదు.. ప్రగతి సోపానాలు..
అలాగే ఏపీలో సీఎం జగన్ ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ఓట్ల కోసం డబ్బు పంపిణీగా చూస్తున్న వారు కూడా ఉన్నారు. అది డబ్బు పంపిణీ కాదు..సంక్షేమాభివృద్ధితో చేసే ఉచిత పథకాలు. అమ్మఒడి, ఆసరా, రైతు భరోసా, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటివన్నీ పథకాలు కావు.. అభివృద్ధికి నిచ్చెనమెట్లు... పేదల పిల్లలు చదువుకునేందుకు ఒక బాధ్యతగల పాలకుడిగా చేస్తున్న సంక్షేమ యజ్ఞం. పిల్లలు ఫీజులు కట్టి.. స్కూళ్ళు బాగుచేసి.. వారి విద్యకోసం ఎంతో ఖర్చుపెట్టి ఉన్నతంగా తీర్చిద్దడానికి ఒక కార్యాచరణ గల పాలకుడు పడుతున్న తాపత్రయం. ఆ బాధ్యతను కూడా ఎగతాళి చేయడం అంటే పేదలకు చదువు వద్దని చెప్పడమే కదా.
మహిళలను ఆర్థికంగా నిలబెట్టేందుకు.. వారు సొంతంగా ఒక వ్యాపారం పెట్టుకుని నిలబడడం ఎంత గొప్ప ఆలోచన. ఇవన్నీ చేయబట్టే కదా మనరాష్ట్ర తలసరి ఆదాయం గత ఐదేళ్ళలో పెరిగింది. దేశంలో 17వ స్థానంలో ఉండే రాష్ట్రం ఇప్పుడు తొమ్మిదో స్థానానికి ఎదిగింది. ఇక నీతి ఆయోగ్ వారి నివేదిక ప్రకారం గతంలో 11-12 శాతంగా ఉండే పేదరికం ఇప్పుడు 6 శాతానికి తగ్గింది.
రైతుభరోసా ఒక విప్లవాత్మకం..
ఇక దేశంలో అన్ని వృత్తులవారికి సాయం చేసింది ఒక ఎత్తు.. రైతుకు మాత్రం చేసేది ఇంకో ఎత్తు.. రైతులకు ఎంత సాయం అందించినా తక్కువే.. మరి వారికీ ప్రతి ఏటా ఖరీఫ్ ముందు పెట్టుబడిసాయం కింద అందిస్తున్న డబ్బు సాయం వారికి ఎంతో ఉపయుక్తం. చిన్నపాటి రైతులకు ఆ డబ్బు సేద్యపు ఖర్చులకు ఉపయోగపడుతుంది. దీంతో రైతులకు అప్పుల బాధ కొంతవరకు తగ్గుతుంది. ఇవన్నీ సంక్షేమపథకాలు కాదు.. ఆయావర్గాల అభివృద్ధికి ఒక బాధ్యతాయుతమైన పాలకుడు వేసిన బాటలు.
డబ్బులు ప్రింట్ చేసేది కేంద్రం..
పేదలకు ఉచితాలు ఇచ్చేసి సోమరులను చేసేసి చివరకు డబ్బు కూడా ప్రింట్ చేసి పంపిణీ చేస్తారేమో అంటూ సెటైర్లు వేయడం సులువే. కానీ దేశంలో కరెన్సీ నియంత్రణ.. నిర్వహణ అంతా కేంద్రం చేతిలో ఉంటుందని, ఈ అంశంతో రాష్ట్రానికి సంబంధం ఉండదని తెలియకపోవడం అజ్ఞానం. ఇక దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రాల జాబితాలో కూడా ఆంధ్రప్రదేశ్ లేదు. అంటే రాష్ట్రం ముందుకు వెళ్తున్నట్లా.. కాదా ? తెలిసీ తెలియకుండా .. అవగాహన లేని అంశాలమీద నోటికొచ్చినట్లు వాగడం సులువే.. రాళ్లేయడం ఇంకా సులువు. కానీ దానివల్ల ఆయావర్గాలకు ఎంత నష్టం కలుగజేస్తున్నామో తెలుసుకోకపోవడం అవివేకం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments