Nadendla:టోఫెల్ శిక్షణ పేరుతో వేల కోట్ల రూపాయల లూటీకి ప్రభుత్వం సిద్ధమైంది: నాదెండ్ల
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు టోఫెల్ శిక్షణ పేరుతో వైసీపీ ప్రభుత్వం లూటీకి తెరతీసిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శలు చేశారు. ప్రపంచంలో ఎన్నడూ చూడని విధంగా పిల్లల ముసుగులో వేల కోట్ల రూపాయలు పక్క దారి పట్టేంచేందుకు రంగం సిద్ధం చేసుకుందని ఆరోపించారు. తెనాలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాదెండ్ల మాట్లాడుతూ విచిత్రంగా 3 నుంచి 10వ తరగతి విద్యార్ధులకు ఏ మాత్రం ఉపయోగపడని టోఫెల్ పరీక్షను బలవంతంగా రుద్దేందుకు ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీసెస్(ఈటీఎస్) వెంటపడి మరి 2027వరకు ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. ఇందుకోసం ఏటా రూ.1052కోట్ల చొప్పున నాలుగు సంవత్సరాలకు కలిపి కనీసం రూ.4వేల కోట్లను దోచుకోవడానికి వైసీపీ నేతలు సిద్ధమయ్యారని మండిపడ్డారు.
డిగ్రీ పూర్తైన విద్యార్థులు మాత్రమే టోఫెల్ పరీక్ష రాస్తారు..
మరో ఐదు నెలల్లో ఇంటికి పోయే వైసీపీ ప్రభుత్వం హడావిడి ఒప్పందం వెనక భారీ స్కాం ఉందన్నారు. డిగ్రీ పూర్తైన విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు టోఫెల్ పరీక్ష రాస్తుంటారని.. అలాంటప్పుడు 3 నుంచి 10వ తరగతి విద్యార్థులకు టోఫెల్ శిక్షణ ఎందుకని ఆయన ప్రశ్నించారు. కేవలం పిల్లల ముసుగులో వేల కోట్లు దోచుకునేందుకే ఈ ఒప్పందం చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరుతో ఉన్న విదేశీ విద్యా పథకాన్ని గాడి తప్పించారని.. జగన్ పేరుతో విదేశీ పథకం తెచ్చి ఏం సాధించారని నాదెండ్ల ప్రశ్నించారు.
ఈ ఒప్పందంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు..
సాధారణంగా కేవలం విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థుల ఆంగ్ల భాషా నైపుణ్యాన్ని పరీక్షించేందుకు టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్ టోఫెల్ అనే పరీక్ష నిర్వహిస్తారు. అయితే ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను కూడా టోఫెల్ పరీక్షకు సన్నద్ధం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గత మే నెలలో ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీసెస్ అనే సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 3 నుంచి 5 తరగతుల వారికి టోఫెల్ ప్రైమరీ పరీక్ష... 6 నుంచి 9 తరగతుల వారికి టోఫెల్ జూనియర్ స్టాండర్డ్ పరీక్ష.. 10వ తరగతిలో విద్యార్థులకు స్పీకింగ్ ఎగ్జామ్ నిర్వహించేలా ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు ఈ ఒప్పందంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments