NTR : రూ.100 నాణేంపై ఎన్టీఆర్ బొమ్మ, పురంధేశ్వరి సూచనలు.. త్వరలోనే విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయులు స్వర్గీయ నందమూరి తారక రామారావుకి ప్రభుత్వ పరంగా దక్కాల్సిన గౌరవం దక్కలేదని ప్రతి తెలుగు వాడు భావిస్తాడు. సినీనటుడిగా, పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా ఆయన సమాజానికి, దేశానికి ఎంతో సేవ చేశారని.. అలాంటి వ్యక్తికి నేటికీ భారతరత్న దక్కకపోవడంపై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే వున్నారు. పలుమార్లు దీనిపై కేంద్రానికి విజ్ఞప్తి చేయడం అక్కడి నుంచి ఎలాంటి స్పందన లభించకపోవడం దశాబ్ధాలుగా జరుగుతూనే వుంది. ప్రస్తుతం అన్నగారి శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఈసారైనా ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదలకు ఆర్‌బీఐ ఓకే:
ఈ నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఓ శుభవార్త చెప్పింది. రూ.100 నాణెంపై ఎన్టీఆర్ బొమ్మను ముద్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ అంగీకరించినట్లుగా ఆయన కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి గతేడాది వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాణెం తయారీకి సంబంధించి హైదరాబాద్‌లోని మింట్ అధికారులు పురంధేశ్వరి నుంచి సలహాలు సూచనలు తీసుకున్నారు. అలాగే నాణేం, దానిపై ఎన్టీఆర్ బొమ్మ మోడల్‌ను ఆమెకు చూపించారు.
నిర్మలా సీతారామన్‌కు పురంధేశ్వరి థ్యాంక్స్:
అనంతరం పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక చొరవ కారణంగానే ఎన్టీఆర్ పేరిట నాణేనికి మింట్ నుంచి ఆమోదం లభించిందన్నారు. దీనికి సంబంధించి 3 ఫోటోలను అధికారులు పరిశీలించారని.. ప్రోసీజర్ పూర్తి కావడానికి నెల రోజులు సమయం పడుతుందని పురంధేశ్వరి వెల్లడించారు. మొత్తానికి అనుకున్నది అనుకున్నట్లు జరిగితే అన్నగారి రూ.100 నాణెం అతి త్వరలోనే విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com