NTR : రూ.100 నాణేంపై ఎన్టీఆర్ బొమ్మ, పురంధేశ్వరి సూచనలు.. త్వరలోనే విడుదల

  • IndiaGlitz, [Wednesday,February 15 2023]

తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయులు స్వర్గీయ నందమూరి తారక రామారావుకి ప్రభుత్వ పరంగా దక్కాల్సిన గౌరవం దక్కలేదని ప్రతి తెలుగు వాడు భావిస్తాడు. సినీనటుడిగా, పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా ఆయన సమాజానికి, దేశానికి ఎంతో సేవ చేశారని.. అలాంటి వ్యక్తికి నేటికీ భారతరత్న దక్కకపోవడంపై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే వున్నారు. పలుమార్లు దీనిపై కేంద్రానికి విజ్ఞప్తి చేయడం అక్కడి నుంచి ఎలాంటి స్పందన లభించకపోవడం దశాబ్ధాలుగా జరుగుతూనే వుంది. ప్రస్తుతం అన్నగారి శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఈసారైనా ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదలకు ఆర్‌బీఐ ఓకే:

ఈ నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఓ శుభవార్త చెప్పింది. రూ.100 నాణెంపై ఎన్టీఆర్ బొమ్మను ముద్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ అంగీకరించినట్లుగా ఆయన కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి గతేడాది వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాణెం తయారీకి సంబంధించి హైదరాబాద్‌లోని మింట్ అధికారులు పురంధేశ్వరి నుంచి సలహాలు సూచనలు తీసుకున్నారు. అలాగే నాణేం, దానిపై ఎన్టీఆర్ బొమ్మ మోడల్‌ను ఆమెకు చూపించారు.

నిర్మలా సీతారామన్‌కు పురంధేశ్వరి థ్యాంక్స్:

అనంతరం పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక చొరవ కారణంగానే ఎన్టీఆర్ పేరిట నాణేనికి మింట్ నుంచి ఆమోదం లభించిందన్నారు. దీనికి సంబంధించి 3 ఫోటోలను అధికారులు పరిశీలించారని.. ప్రోసీజర్ పూర్తి కావడానికి నెల రోజులు సమయం పడుతుందని పురంధేశ్వరి వెల్లడించారు. మొత్తానికి అనుకున్నది అనుకున్నట్లు జరిగితే అన్నగారి రూ.100 నాణెం అతి త్వరలోనే విడుదల కానుంది.

More News

Singer Sunitha:  ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన సింగర్ సునీత .. ఇక పుకార్లకు చెక్ పడినట్లేనా..?

పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లలను పెట్టుకుని మిడిల్ ఏజ్‌లో సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారంటూ సింగర్ సునీతపై కొందరు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు.

Godavari Express:పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్.. తృటిలో తప్పిన పెనుప్రమాదం, నెమ్మదిగా వెళ్లడమే కాపాడింది

హైదరాబాద్ నగర శివార్లలో పెను రైల్వే ప్రమాదం తృటిలో తప్పిపోయింది. విశాఖ- హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది.

Marburg Virus : ఆఫ్రికాలో వెలుగుచూసిన మరో ప్రాణాంతక వైరస్.. ఇప్పటి వరకు 9 మంది మృతి, లక్షణాలివే

రెండేళ్ల పాటు మనిషిని నాలుగు గోడల మధ్య బందీని చేసిన కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే శాంతిస్తోంది.

RK Roja:నేను జబర్దస్త్ ఆంటీనైతే.. మీ అమ్మ హెరిటేజ్ ఆంటీ, నీ భార్య హెరిటేజ్ పాపా : లోకేష్‌కు రోజా స్ట్రాంగ్ కౌంటర్

తనపై టీడీపీ యువనేత నారాల లోకేష్ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటరిచ్చారు మంత్రి ఆర్‌కే రోజా.

Renu Desai: రేణూ దేశాయ్‌కి హార్ట్ ప్రాబ్లమ్.. కోలుకుని తిరిగొస్తానంటూ ఎమోషనల్ పోస్ట్, ఉలిక్కిపడ్డ అభిమానులు

టాలీవుడ్ టూ కోలీవుడ్ ఇప్పుడు ఏ ఇండస్ట్రీ చూసినా హీరోయిన్ల ఆరోగ్యం అస్సలు బాగుండటం లేదు.