ఏలూరు ఘటనపై ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ఏమన్నారంటే..
Send us your feedback to audioarticles@vaarta.com
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏలూరు ఘటనపై స్థానిక ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ఏవీఆర్ మోహన్ స్పందించారు. అది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన వ్యాధి కాదని.. సీసం లేదా సీసంతో పాటు ఫెస్టిసైడ్స్ కలిసి ఇలాంటి వ్యాధి కి కారకులుగా తెలిశాయన్నారు. ఏపీ సీఎం జగన్‌తో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మోహన్ మీడియాతో మాట్లాడుతూ... కెమికల్ టెక్నాలజీ రిపోర్ట్ రేపు వస్తాయని.. సీసీఎంబీ రిపోర్టులు వారంలోగా వస్తాయన్నారు.
ఇక ఎయిమ్స్ ఫలితాలు రేపు వస్తాయని ఏవీఆర్ మోహన్ పేర్కొన్నారు. ఎన్ఐఎన్ ఫలితాలు శుక్రవారం సాయంత్రానికి వస్తాయన్నారు. తాగునీటికి చేసిన కల్చర్ టెస్ట్ కూడా నెగిటివ్ వచ్చిందన్నారు. జంతువులు, కీటకాల శాంపిల్స్‌ను ఎన్‌సీడీసీ బృందం తీసుకుందన్నారు. కాగా.. పూర్తి ఫలితాలు శుక్రవారానికి తెలుస్తాయన్నారు. ప్రస్తుతం కేసులు తగ్గాయని ఇక మీదట ప్రాణభయం అయితే లేదని ఏవీఆర్ మోహన్ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments