వికటించిన కరోనా వ్యాక్సిన్.. దేశంలో తొలి మరణం!

  • IndiaGlitz, [Tuesday,June 15 2021]

దేశం నలువైపులా కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా ధాటిని తట్టుకునేందుకు అనేక వ్యాక్సిన్స్ అందుబాటులోకి వచ్చాయి. కరోనాని జయించేందుకు వ్యాక్సినేషన్ చాలా కీలకం అని ప్రపంచ వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఇండియాలో కూడా వ్యాక్సినేషన్ ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందరికి అందుబాటులో ఉంచేలా వ్యాక్సిన్స్ ఉత్పత్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి: కోవిడ్ తగ్గాక కీళ్ల నొప్పులు అందుకే.. టీకా, థర్డ్ వేవ్ గురించి ప్రముఖ ఆర్థోపెడిక్..

అయితే వ్యాక్సిన్స్ పై అనేక అపోహలు ఉన్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఇప్పటికే తేలింది. అయితే వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు రోగ నిరోధక శక్తి బలపడడానికి రెండురోజుల పాటు ఇలాంటి దుష్ప్రభావాలు సహజంగానే ఉంటాయి. వాటిని చూసి బయపడనవసరం లేదని వైద్య నిపుణులు భరోసా ఇచ్చారు.

అయితే తాజాగా వ్యాక్సిన్ వల్ల ఇండియాలో తొలి మరణం సంభవించింది. వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువవడం వల్ల 68 ఏళ్ల వృద్దుడు మరణించారు. అడ్వర్స్‌ ఈవెంట్స్‌ ఫాలోయింగ్‌ ఇమ్యునైజేషన్‌(ఏఈఎఫ్‌ఐ) సంస్థ ధృవీకరించింది. ఈ సంస్థ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కలిగే ప్రభావాలపై అధ్యయనం చేస్తూ ఉంటుంది.

ఆ వృద్ధుడు మార్చి 8న తొలి డోసు వ్యాక్సిన్ తీసుకున్నాడు. అనాఫిలాక్సిన్ అని పిలవబడే తీవ్ర అలర్జీ కారణంగా అతడు మరణించినట్లు ఏఈఎఫ్ఐ పేర్కొంది. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత రెండు రోజుల పాటు శరీరానికి తీవ్ర ఒత్తిడి కలిగించే పనులు చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు.

వ్యాక్సిన్ దుష్ప్రభావాలని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నామని ఆ సంస్థ తెలిపింది. అయితే వ్యాక్సిన్ వల్ల అతి తక్కువ శాతంలో ఉండే రిస్క్ తో పోల్చుకుంటే లాభాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని ప్యానల్ తెలిపింది.

More News

బుర్రకథ హీరోయిన్ అరెస్ట్.. స్నేహితుడితో కలసి గంజాయి తీసుకుంటూ..

యంగ్ హీరోయిన్ నైరా షాని నార్కోటిక్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదివారం ఈ సంఘటన జరిగింది.

నితిన్ లైనప్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్.. ఈసారి డెబ్యూ డైరెక్టర్ తో..

యూత్ స్టార్ నితిన్ వరుస చిత్రాలని చకచకా పూర్తి చేస్తున్నాడు. నితిన్ ఇప్పటికే ఈ ఏడాది రెండు చిత్రాలని రిలీజ్ చేశాడు.

కోవిడ్ తగ్గాక కీళ్ల నొప్పులు అందుకే.. టీకా, థర్డ్ వేవ్ గురించి ప్రముఖ ఆర్థోపెడిక్..

కోవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ కీళ్లు, కండరాలకు సంబంధించిన నొప్పులు వస్తున్నాయి.

స్టార్ హీరోకి రూ.100 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వనున్న దిల్ రాజు?

బాహుబలి తర్వాత చిత్ర పరిశ్రమలో భాషా పరిమితులు చెల్లాచెదురయ్యాయి. ఇప్పుడు అందరూ పాన్ ఇండియా చిత్రాలు అంటున్నారు.

న్యూడ్ సీన్ కి రెడీ.. బోల్డ్ డెసిషన్ తీసుకున్న హీరోయిన్!

నటి, సింగర్ ఆండ్రియా జెరెమియా నిత్యం వార్తల్లో ఉంటుంది. వివిధ అంశాలపై ఆండ్రియా ధైర్యంగా తన అభిప్రాయం చెబుతూ ఉంటుంది.