సచివాలయ ప్రశ్నాపత్రాల లీకేజీపై ప్రభుత్వం క్లారిటీ.. అరెస్ట్‌లు!
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన జరిపిన గ్రామ సచివాలయ పరీక్షా పత్రాలు లీకైనట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇది ఎంతవరకు నిజం..? ఇందులో నిజమెంత..? అనే విషయాలు మాత్రం తెలియరాలేదు. అయితే.. పేపర్ లీక్ అయినట్లు వార్తలు వస్తుండటం పరీక్ష రాసిన అభ్యర్థుల్లో కలవరం మొదలైంది. అయితే ఈ వ్యవహారంపై తాజాగా.. ఏపీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు.
ఎలాంటి అపోహలొద్దు!
‘ప్రశ్నా పాత్రం లీకైనట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామక పరీక్షను ప్రతిష్టాత్మకంగా, పకడ్బందీగా నిర్వహించాము. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొంతమంది అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు. పరీక్షలను పూర్తి పారదర్శకంగా నిర్వహించాము. ప్రశ్నాపత్రం బయటకు వచ్చే అవకాశమే లేదు. ఈ వార్తలు వాస్తవాలు కాదు. పరీక్షల నిర్వహణను అన్ని మీడియా సంస్థలు ప్రశంసించిన అంశం అందరికీ గుర్తుండే ఉంటుంది. అభ్యర్థులు ఎలాంటి అపోహలకు గురి కావద్దు’ అని ఈ సందర్భంగా పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.
అరెస్ట్‌ల పర్వం!
ఇదిలా ఉంటే.. తెలుగుదేశం పార్టీకి చెందిన ‘తెలుగు యువత’ నేతలు, కార్యకర్తలు ఈరోజు విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఈ ప్రశ్నాపత్రం లీకైందని ఆరోపించారు. కాబట్టి వెంటనే పరీక్షలను రద్దుచేసి మళ్లీ కొత్తగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మం, ఇతర కార్యకర్తలను అరెస్ట్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout