జగన్ పాదయాత్ర ముగింపులో గోవిందా.. గోవిందా!

  • IndiaGlitz, [Wednesday,January 09 2019]

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌‌రెడ్డి పాదయాత్ర ముగింపు రోజున కీలక ప్రసంగం చేశారు. ఇన్ని రోజుల పాదయాత్రలో తాను చూసిన ప్రజల కష్టాలు, కొన్ని మరిచిపోని ఘటనలను ఈ ముగింపు సభా వేదికగా జగన్ చెప్పుకొచ్చారు. అదే విధంగా ప్రభుత్వ పనితీరును.. అది చేస్తాం.. ఇది చేస్తామన్న చంద్రబాబు చివరికి చేసిందేమీ లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సభలో జగన్ నోట ఎక్కువ సార్లు.. ‘గోవిందా.. గోవిందా’, ‘నిన్ను నమ్మం బాబూ’ అనే పదాలే ఎక్కువ సార్లు వినిపించాయి. అసలు ఏ సందర్భాల్లో జగన్ ఈ పదాలు వాడారనే విషయం ఇప్పుడు చూద్దాం.

జగన్ మాటల్లోనే..
చంద్రబాబు హయాంలో ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి లేదని.. నిరాశలో నిరుద్యోగ యువత ఉన్నారని ఆయన అన్నారు. ఎప్పుడైతే బాబు సీఎం అయ్యాడో.. 30 వేల ఆదర్శ రైతుల ఉద్యోగాలు గోవిందా..?.. గోపాలమిత్ర ఉద్యోగాలు గోవిందా.. ఆయుష్‌ పనిచేస్తున్న అక్కా చెల్లెమ్మల ఉద్యోగాలు గోవిందా.. సాక్షర భారత్‌లో పనిచేస్తున్న 30వేల మంది ఉద్యోగాలు గోవిందా.. మధ్యాహ్న భోజనం పథకంలో పనిచేస్తున్న 85 వేల మంది ఉద్యోగాలు గోవిందా.. గోవిందా అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.

అయితే విభజన సమయానికి లక్షా 42 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఈ నాలుగేళ్లలో మళ్లీ 90వేలు ఖాళీ అయ్యాయని ఇలా మొత్తం మొత్తం సుమారు 2 లక్షల 20వేల ఉద్యోగాల్లో ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయకపోవడం బాధాకరమన్నారు. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకపోగా.. చంద్రబాబు మాత్రం 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని ప్రచారం చేస్తున్నారని జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాగా జగన్ మాట్లాడుతున్నంత సేపు సభకు విచ్చేసిన వైఎస్ అభిమానులు, కార్యకర్తలు ‘జోహార్ వైఎస్సార్.. జై జగన్.. సీఎం.. సీఎం.. సీఎం’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. కాగా సుమారు గంటన్నరకుపైగానే జగన్ కీలక ప్రసంగం చేశారు.

More News

ఓటమికి దగ్గరగా టీడీపీ.. వైసీపీదే గెలుపు..!

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయారని.. అందుకే ఆయన ఓటమికి దగ్గరగా ఉన్నారని..

బాలయ్యపై లక్ష్మీపార్వతి షాకింగ్ కామెంట్స్!

దివంగత ముఖ్యమంత్రి, ఆంధ్రుల ఆరాధ్యుడైన ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి.. హీరో బాలకృష్ణను మెచ్చుకున్నారు.

రేవంత్‌‌ రెడ్డికి మరో కోలుకోలేని షాక్..!

తెలంగాణ ఎన్నికల్లో కలలో కూడా ఊహించని రీతిలో కొడంగల్‌‌లో ఘోరంగా ఓటమిని చవిచూసిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి వరుస షాక్‌లు వెంటాడుతున్నాయి.

వైఎస్ జగన్ పాదయాత్ర సక్సెస్‌‌కు కారణమిదే..

వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రజా సంకల్ప యాత్ర' నేటితో శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో ముగియనుంది.

న్యాయం చేశాననుకుంటున్న బాలీవుడ్ సొగ‌స‌రి

గత ఏడాది 'వీడెవడు' చిత్రంలో నటించిన ఈషాగుప్తా ఈ ఏడాది 'వినయవిధేయరామ' చిత్రంతో పలకరించనుంది.