తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా గవర్నర్ ఒక రకంగా అనుకూలంగానే వ్యవహరిస్తారు. ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించడమే ఇప్పటి వరకూ చూశాం. కానీ మొదటిసారి ఒక గవర్నర్ రాష్ట్ర సర్కారుపై విరుచుకుపడ్డారు. అది కూడా ఎక్కడో కాదు... తెలంగాణలోనే జరిగింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై ప్రభుత్వ వైఫల్యాలను ఏమాత్రం లైట్ తీసుకోలేదు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పించారు. ఇటీవల ఆమె ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో్ తమిళిసై ఈ సంచలనానికి తెరదీశారు. కరోనా నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అసంతృప్తి వ్యక్తం చేశారు.
కేసీఆర్ సర్కార్‌పై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా నియంత్రణలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా కట్టడిలో కేసీఆర్ సర్కార్ క్రియాశీలకంగా వ్యవహరించలేదంటూ మండిపడ్డారు . కరోనా ఉధృతిని ప్రభుత్వం అంచనా వేయలేకపోయిందన్నారు. కరోనా నియంత్రణకు పెద్ద సంఖ్యలో టెస్టులు చేయడమే పరిష్కార మార్గమని, మొబైల్ టెస్టింగ్‌లు చేయాలని ప్రభుత్వాన్ని కోరామని తమిళిసై అన్నారు. కరోనా తీవ్రత, వ్యాప్తిపై ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ.. సూచనలు చేస్తూ... ఐదారు లేఖలు రాసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనలేదని గవర్నర్ తమిళిసై ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకే టెస్టులు చేస్తున్నామని... ప్రభుత్వం సమర్ధించుకుంటోందని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. కట్టడి ప్రాంతాల విషయంలో కూడా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందన్నారు. కరోనా బాధితులు ప్రభుత్వాస్పత్రుల్లో సదుపాయాలు లేక ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారని, కోవిడ్ చికిత్స తెలంగాణ ప్రభుత్వానికి భారంగా మారిందని తమిళిసై అన్నారు. అన్ని వసతులు సమకూర్చామని ప్రభుత్వం చెబుతున్నా... ప్రభుత్వాస్పత్రుల పట్ల రోగులు ఆసక్తి చూపట్లేదన్నారు. సీఎం కేసీఆర్‌తో సమావేశమైనప్పుడు ఈ విషయాలను గట్టిగానే చెప్పానని తమిళిసై తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout