రైతులకు మద్దతుగా గళం విప్పిన గవర్నర్ సత్యపాల్
Send us your feedback to audioarticles@vaarta.com
రైతులకు మద్దతుగా బీజేపీకి చెందిన ప్రముఖులే నిలుస్తుండటం విశేషం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిను మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఇప్పటికీ ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. రైతులకు మద్దతుగా దేశం మొత్తం నిలుస్తోంది. అయినా ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. బీజేపీ నేతలెవరైనా దీనిపై నోరు మెదపాలన్నా ప్రధాని మోదీకి భయపడి కామ్‌గా ఉన్నారు. అయితే ఆ పార్టీకి చెందిన ఓ ప్రముఖుడు మాత్రం రైతులకు మద్దతుగా తన గళం వినిపించడం విశేషం. ఆయన ఎవరో కాదు మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్.
గవర్నర్ సత్యపాల్ మాలిక్ రైతులను ఉద్దేశించి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బాగ్‌పత్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాగు చట్టాల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను నిందించవద్దని రైతులకు సూచించారు. అంతేకాదు, పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు కేంద్రం చట్టపరమైన హామీ ఇస్తే రైతులు ఆనందిస్తారని పేర్కొన్నారు. సాగు చట్టాలపై అసత్యాలను ప్రచారం చేస్తున్న రైతు సంఘం నేత రాకేశ్ తికాయత్‌ను అరెస్ట్ చేయాలని అన్నారు. ఇదే సమయంలో రైతులపై బలప్రయోగం చేయవద్దని, ఢిల్లీ సరిహద్దుల నుంచి వారిని ఒట్టిచేతులతో పంపొద్దని ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు విజ్ఞప్తి చేశారు.
చట్టాలు రైతులకు అనుకూలంగా లేవని.. దేశంలోని రైతులు, సైనికులు సంతృప్తిగా లేకపోతే దేశాభివృద్ధి అనేది ముందుకు సాగదని సత్యపాల్ మాలిక్ పేర్కొన్నారు. అది దేశానికి క్షేమం కాదన్నారు. కాబట్టి సైన్యం, రైతులను సంతోషంగా ఉంచాలని మోదీకి సూచించారు. దేశంలో రైతుల పరిస్థితి దీనంగా ఉందని సత్యపాల్ మాలిక్ ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎందుకిలా పేదవారిగా మారిపోతున్నామో రైతులకు తెలియదని, ఆత్మపరిశీలన చేసుకునే అవగాహన వారికి కరువైందన్నారు. నిజానికి రైతులకు చాలా సందేహాలు ఉన్నాయని.. వాటికి తప్పక సమాధానమివ్వాలని సత్యపాల్ మాలిక్ అభిప్రాయపడ్డారు. నేడు రైతులకు అనుకూలంగా ఏ చట్టమూ లేదని.. దీన్ని సరిదిద్దాలని గవర్నర్ సత్యపాల్ మాలిక్ పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout