కౌశిక్‌రెడ్డి ఎన్నికల ప్రచారంపై గవర్నర్ సీరియస్.. చర్యలకు ఈసీకి ఆదేశం..
Send us your feedback to audioarticles@vaarta.com
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డిపై(Padi Kaushikreddy) ఎన్నికల ప్రచారంపై గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్(Tamilisai) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను బ్లాక్‌మెయిల్ చేస్తూ ఆయన చేసిన ప్రసంగంపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ జేఎన్టీయూలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ మాట్లాడుతూ గెలిస్తే ప్రజలకు ఏం చేస్తామో చెప్పి చెప్పాలని.. అంతేకానీ సూసైడ్ చేసుకుంటామంటూ బెదిరించి ఓట్లు అడగడం సరికాదని అభిప్రాయపడడ్డారు. అలాంటి నేతలపై చర్యలు తీసుకోవాలని ఈసీకి సూచించారు.
అలాగే దేశంలో ప్రజాస్వామ్యం బతకాలి అంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేయాలని కోరారు. మంచి అభ్యర్థిని ఓటర్ ఎన్నుకుంటే మంచి పాలన అందుతుందని తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు మధ్య వారధిగా ఉండటం తన బాధ్యత అని చెప్పుకొచ్చారు. ఇటీవల జరిగి అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా జరిపినందుకు అధికారులను అభినందించారు. పోలింగ్ డేను సెలవు దినంగా పరిగణించకూడదని యువత గుర్తించుకోవాలని సూచించారు. తాను నోటా ఓటుకు వ్యతిరేకమని.. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎవరో ఒక్క అభ్యర్థిని ఎన్నుకోవాలని పేర్కొన్నారు. అలా ఎన్నుకున్నప్పుడే మంచి నాయకులు వస్తారన్నారు.
కాగా గతేడాది నవంబర్ 28న హుజురాబాద్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భార్య, కుమార్తెతో కలిసి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ఫలితాల తరువాత మీరు మా విజయ యాత్రకు రావాలా.. మా శవయాత్రకు రావాలా అనేది మీరే తేల్చాలని ప్రజలను కోరారు. మమ్మల్ని మీరే కాపాడాలి.. మా జీవితాలు, మా ప్రాణాలన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఓడిపోతే కుటుంబమంతా బలవన్మరణానికి పాల్పడడమే తమ ముందున్న మార్గం అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఓటర్లను బ్లాక్‌మెయిలింగ్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులపై స్పందించిన ఈసీ సుమోటోగా కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేసింది. పూర్తిస్థాయిలో విచారణ జరపాలని అధికారులను ఆదేశించింది. తాజాగా గవర్నర్ కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో ఆయనపై అనర్హత వేటు వేసే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout