TSPSC చైర్మన్, సభ్యుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం

  • IndiaGlitz, [Wednesday,January 10 2024]

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న TSPSC చైర్మన్, సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బోర్టు చైర్మన్ జనార్థన్ రెడ్డితో పాటు సభ్యులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే వీరి రాజీనామాలను ఆమోదించకుండా గవర్నర్ పెండింగ్‌లో ఉంచారు. పేపర్ లీకేజీ బాధ్యులు ఎవరో తెలియకుండా రాజీనామాలు ఆమోదించడం సమంజసం కాదని ఆమె భావించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని అడిగారు. అయితే వారి రాజీనామాలపై సర్కార్ నుంచి ఎలాంటి అభ్యంతరం రాలేదు. దీంతో న్యాయ సలహా తీసుకున్న గవర్నర్ తాజాగా వారి రాజీనామాలను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

సభ్యుల రాజీనామాల ఆమోదం నేపథ్యంలో త్వరలోనే కొత్త బోర్టు ఏర్పాటు కానుంది. ఇప్పటికే ప్రభుత్వం పలువురు అధికారుల పేర్లను పరిశీలిస్తోంది. మరికొన్ని రోజుల్లోనే కొత్త బోర్డు ఏర్పాటు చేసి పరీక్షల నిర్వహణకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని యువత గవర్నమెంట్ ఉద్యోగులు సాధించేందుకు అవసరమైన పరీక్షలను TSPSC నిర్వహిస్తోంది. అయితే గత ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు పేపర్లు లీక్ కావడం సంచలనంగా మారింది. దీంతో అనేక మంది నిరుద్యోగులు పరీక్షలు రాసే అవకాశం కోల్పోయారు. అప్పటి నుంచి పేపర్ల లీకేజీకి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి.

ఈ క్రమంలోనే ఇందుకు కారణమైన కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అయితే యువత భవిష్యత్‌కు సంబంధించిన ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై గవర్నర్ తమిళిసై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే బోర్డు ఛైర్మన్ జనార్థన్ రెడ్డి రాజీనామా చేశారు. కానీ అప్పటి కేసీఆర్ సర్కార్ ఆయన రాజీనామాను ఆమోదించలేదు. ప్రభుత్వం మారడంతో మళ్లీ ఆయన రాజీనామా చేశారు. దీంతో తాజాగా కొత్త ప్రభుత్వం నిర్ణయంతో రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు.

More News

Ambati Rayudu: జనసేనలోకి అంబటి రాయుడు.. పవన్ కల్యాణ్‌తో భేటీ..

ఏపీ రాజకీయాలు ఏ క్షణం ఎలాంటి మలుపులు తిరుగుతాయో ఊహించడం కష్టమౌతోంది. ఎవరూ ఎప్పుడూ ఏ పార్టీలో చేరతారో అర్థం కావడం లేదు. తాజాగా వైసీపీకి రాజీనామా చేసిన టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు

Chandrababu: బ్రేకింగ్: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు భారీ ఊరట

ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ దొరికింది. ఇన్నర్ రింగ్ రోడ్డు, లిక్కర్, ఇసుక కేసుల్లో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.

Mahesh Babu: థ్యాంక్యూ మై హోమ్‌టౌన్ గుంటూరు.. మహేష్ ఎమోషనల్ పోస్ట్..

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న 'గుంటూరు కారం' సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. దీంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్‌లో జోరు పెంచింది.

Kesineni Nani: వైసీపీలోకి విజయవాడ ఎంపీ కేశినేని నాని.. జగన్‌తో భేటీ..?

ఎన్నికల వేళ విజయవాడ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. టీడీపీకి దూరమైన ఎంపీ కేశినేని నాని, ఆయన కుమార్తె శ్వేత వైసీపీలో చేరబోతున్నట్లు ప్రచారం ఊపందుకుంది.

Charminar Express: నాంపల్లిలో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్.. ప్రయాణికులకు గాయాలు..

హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వేస్టేషన్‌లో పెను ప్రమాదం తప్పింది. చెన్నైలోని తాంబరం నుంచి హైదరాబాద్ వచ్చిన చార్మినార్ సూపర్ ఫాస్ట్ రైలు పట్టాలు తప్పింది.