గాంధీ ఆస్పత్రి సిబ్బందితో ప్రభుత్వ చర్చలు సఫలం
Send us your feedback to audioarticles@vaarta.com
గాంధీ ఆస్పత్రి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, నర్సులతో ప్రభుత్వ చర్చలు సఫలమయ్యాయి. నర్సులకు 17,500 నుంచి 25 వేలకు ప్రభుత్వం వేతనాన్ని పెంచింది. కరోనా డ్యూటీలు చేస్తున్న వాళ్లకు డైలీ ఇంటెన్సివ్ కింద 750 రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించింది. అవుట్ సోర్సింగ్ నుంచి, కాంట్రాక్టులోకి మార్చేందుకు ప్రయత్నిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. నాల్గవ తరగతి ఉద్యోగులకు రోజుకు 300 రూపాయల ఇన్సెoటివ్, 15 రోజులు మాత్రమే డ్యూటీ ఉండేలా చూస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ విధుల్లో చేరాలని మెడికల్ జేఏసీ సూచించింది.
కాగా.. గాంధీ ఆస్పత్రి వద్ద నాల్గవ తరగతి ఉద్యోగులు మంగళవారం నుంచి ధర్నాకు దిగారు. సెక్యూరిటి, శానిటైజేషన్, ఫోర్త్ క్లాస్ పేషేంట్ కేర్ సిబ్బంది విధులు బహిష్కరించారు. తమకు కనీస వేతనాలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలంటూ ఆందోళన నిర్వహించారు. వీరికంటే వారం రోజుల ముందు నుంచే 600 మంది నర్సులు నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు. విధులకు హాజరు కావాలని ప్రభుత్వం కోరినా ఉద్యోగులు ససేమిరా అనడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments