విశాల్‌కు షాకిచ్చిన ప్రభుత్వం
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళనాడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు విశాల్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నిర్మాతల మండలి ఎన్నికలు సందర్భంలో హామీలను నేరవేర్చకపోవడం.. కార్యవర్గం పలు ఆరోపణలు ఎదుర్కోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
నిర్మాత మండలి నిధి నుండి ఖర్చు చేసిన 7 కోట్ల రూపాయలకు విశాల్ అండ్ కో లెక్కలు చూపడం లేదని పలువురు ఆరోపణలు చేశారు. ఆందోళన చేసి మండలి కార్యాలయానికి తాళాలు కూడా వేసేశారు. ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది.
ఇటీవల నిర్వహించిన ఇళయరాజా 75వ పుట్టినరోజు సందర్భంగా కూడా సర్వసభ్య అమోదం పొందకుండానే కార్యక్రమాన్ని నిర్వహించారు. విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో, మండలిలో ఓ వర్గం ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తిని చేశారు. దీంతో నిర్మాతల మండలిని ప్రభుత్వం తన ఆధీనంలో తీసుకుంది.
ఎన్.శేఖర్ని ప్రభుత్వం పర్యవేక్షకుడిగా నియమించింది. ఇకపై మండలి కార్యక్రమాలను నిర్వహించాలనుకుంటే పర్యవేక్షకుడి అనుమతి తీసుకోవాల్సిందే.మరి విశాల్ అండ్ కో దీనిపైఎలా స్పందిస్తారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout