Cylinder Scheme:రూ.500కే సిలిండర్ పథకం అమలుకు ప్రభుత్వం కసరత్తు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ప్రధాన కారణం ఆ పార్టీ ఇచ్చి ఆరు గ్యారంటీల హామీలు. ప్రభుత్వం వచ్చిన రెండు రోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి రెండు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం రూ.10లక్షలకు పెంపు హామీలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. దీంతో రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకం, నెలకు రూ.2,500 ఆర్థిక సాయం హామీలపై మహిళలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో భాగంగా సబ్సిడీ సిలిండర్ కోసం గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు.
ఈ నేపథ్యంలో రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకం అమలు కోసం పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు. గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేయాలంటే ఏటా 3 నుంచి 4వేల కోట్ల రూపాయలు అవసరమని అధికారులు తేల్చారు. వంద రోజుల్లోనే ఈ హామీని నెరవేరుస్తామని దీనికోసం అధికారులతో కసరత్తు చేస్తున్నానని మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి త్వరలో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు.
దీంతో పాటు మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2,500 ఆర్థిక సాయం పొందటం కోసం మహిళలు ఆదాయ, కుల ధ్రువీకరణపత్రాల కోసం ఎమ్మార్వో కార్యాలయాలు, ఈసేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఇక కొత్త రేషన్ కార్డులు ఇస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చిన నేపథ్యంలో దరఖాస్తుల కోసం కూడా ఆరా తీస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మహిళల్లో ఫుల్ క్రేజ్ తెచ్చి పెట్టాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments