ఎన్.శంకర్ స్టూడియో భూముల వ్యవహరం.. ప్రభుత్వ వివరణ
- IndiaGlitz, [Monday,November 09 2020]
దర్శకుడు ఎన్.శంకర్ స్టూడియో నిర్మాణానికి నామమాత్రపు ధరలకు తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయించడంపై కోర్టులో ప్రజాహిత వ్యాజ్యం వేశాడు కరీంనగర్‌కు చెందిన జె.శంకర్. తెలంగాణకు చెందిన దర్శకుడు ఎన్.శంకర్‌కు ఎకరాను రూ.5 లక్షల చొప్పున 5 ఎకరాలు కేటాయించారు. దీనిపై హైదరాబాద్ మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ కౌంటర్ దాఖలు చేశారు.
ఎన్.శంకర్ తెలంగాణకు చెందిన బడుగు, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి అని, సినీ పరిశ్రమలో ఆయనకు 36 ఏళ్ల అనుభవం ఉందని, తనకు భూమి కేటాయిస్తే రూ.50 కోట్ల ఖర్చుతో ప్రపంచస్థాయి స్టూడియో నిర్మిస్తానని 2016లో శంకర్ ప్రభుత్వానికి దర్శఖాస్తు చేసుకున్నారు ఎన్.శంకర్. స్థానిక ప్రతిభావంతులను ప్రోత్సహించడానికి శంకర్‌కు భూమిని కేటాయించాల్సిన అవసరం ఉన్నట్లు ఫిలిండెవలప్‌మెంట్ కొర్పొరేషన్ సిఫార్స్ చేసిందన్నారు అనిల్‌కుమార్.
‘‘అక్కినేని నాగేశ్వర్‌రావుకు అప్పటి ప్రభుత్వం అన్నపూర్ణ స్టూడియో నిర్మాణం కోసం 1975లో రూ.5 వేల చొప్పున 22 ఎకరాలను కేటాయించింది. పద్మాలయ స్టూడియో కోసం 1983లో రూ.8,500 చొప్పున 9.5 ఎకరాలను కేటాయించింది. అలాగే 1984లో సురేశ్ ప్రొడక్షన్‌కు నామమాత్రపు ధరకే అప్పటి ప్రభుత్వం 5 ఎకరాలను కేటాయించింది. 1984లో దర్శకుడు రాఘవేందర్‌రావు, చక్రవర్తి, కృష్ణమోహన్‌కు రూ.8,500 ప్రకారం అర ఎకరం చొప్పున కేటాయించారు’’అని అరవింద్‌కుమార్ తెలిపారు.
‘‘మార్కెట్ విలువ రూ.20 లక్షలు ఉన్నప్పటికీ సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఐదెకరాల భూమిని కేటాయించాం. ఇందుకోసం శంక్ 4.4 కోట్ల రూపాయలను డిపాజిట్ చేశారు. స్టూడియో నిర్మాణంతో 100 మంది శాశ్వత, 200 తాత్కాలిక ఉద్యోగాలను కల్పించడంతోపాటు 1000 మందికి కళాకారులకు ఉపాధి కల్పిస్తామని శంకర్ భరోసా ఇచ్చారు’’ అని అనిల్‌కుమార్ తెలిపారు.