Bigg Boss 7 Telugu : అంతా ఫేక్ మనుషులే.. నేనుండలేను, గౌతమ్‌తో ప్రిన్స్ గొడవ.. సందీప్‌పై శివాజీ ఆరోపణలు
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ అస్త్ర, మాయా అస్త్రతో ఇంటి సభ్యుల మధ్య చిచ్చు పెట్టేందుకు బిగ్‌బాస్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే శివాజీ, రతిక, అమర్‌దీప్‌లు కంట్రోల్ తప్పగా.. ఇవాళ్టీ ఎపిసోడ్‌లో ప్రిన్స్, గౌతమ్, సందీప్‌లను రెచ్చగొట్టాడు. మాయ అస్త్రను గెలుచుకున్న రణధీర టీమ్‌లో ఎవరు దాన్ని ఉంచుకునేందుకు అనర్హులో చెప్పే టాస్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే. టాస్క్‌లో భాగంగా ప్రిన్స్ దగ్గరున్న భాగాన్ని .. మహబలి టీమ్ తీసుకుని దానిని శివాజీ చేతిలో పెట్టింది. దీనికి ప్రిన్స్ ససేమిరా అంగీకరించలేదు. నా భాగాన్ని ఇవ్వనంటే ఇవ్వనని నానా రచ్చ చేశాడు. కోపంతో ఊగిపోయిన ఆయన.. అసలు తనకు హౌస్‌లో వుండటం ఇష్టం లేదని, ఇది చాలా బ్యాడ్ గేమ్ అంటూ కంట్రోల్ తప్పాడు. తన భాగాన్ని విసిరేసి.. గౌతమ్ వైపు కోపంగా చూస్తూ.. గేట్లు తీస్తే ఇంటికెళ్లిపోతానని కన్నీటి పర్యంతమయ్యాడు.
మరోవైపు.. మహబలి టీమ్‌లో అంతా కూడబలుక్కుని శివాజీ, షకీలాలే అర్హులు అన్నట్లుగా మాయ అస్త్ర భాగాల్ని ఇవ్వడంతో ఇంటి సభ్యుల మధ్య వాదనలు జరిగాయి. అదే గ్రూపులో వున్న రతిక.. ఒక్కసారిగా గట్టిగట్టిగా కేకలు పెట్టింది. తాను శివాజీ, ప్రిన్స్ అని చెబితే.. తన మాట అస్సలు వినలేదని ప్లేట్ ఫిరాయించింది. ఈ మాటలు జీర్ణించుకోలేని ప్రశాంత్, గౌతమ్ ఆమెపై గొంతు చించుకున్నారు. ఇప్పుడు చెబితే ఎలా అని గొడవపడ్డారు. ఆమెపై చేయ్యి ఎత్తే వరకు పరిస్ధితి వెళ్లింది. ఇంతలో ప్రిన్స్ జోక్యం చేసుకుని.. బిగ్‌బాస్ ఇచ్చిన పనిష్మెంట్ కూడా మరిచిపోయి ఇంగ్లీష్, హిందీలలో ఆర్గ్యూమెంట్ చేశాడు.
ప్రిన్స్‌కు గౌతమ్ కూడా అదే స్థాయిలో కౌంటరిచ్చాడు. గౌతమ్ ఎంత కంట్రోల్ చేసుకున్నా.. పదే పదే మీదకొస్తూ యువర్ గొడవ పెట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ వివాదం సద్దుమణిగిన తర్వాత అర్ధరాత్రి కన్ఫెషన్ రూంలోకి పిలిచి యువర్‌ను సముదాయించే ప్రయత్నం చేశాడు బిగ్‌బాస్. అసలు ఏం జరిగిందనేది అతని నుంచే రాబట్టే ప్రయత్నం చేశాడు. ఇక్కడ అంతా ఫేక్ మనుషులేనని, వాళ్లతో తాను ఉండలేనని యువర్ బిగ్‌బాస్ చెప్పాడు. గౌతమ్ తనకు సారీ చెప్పాలని ప్రిన్స్ కోరగా.. కుదరదని బిగ్‌బాస్ కరాఖండీగా తేల్చిచెప్పాడు.
ఇంతలో రెండో పవర్ అస్త్ర కోసం మరో పోటీదారుడిగా ఎవరిని ఎంచుకుంటున్నారు అని సందీప్‌ను బిగ్‌బాస్ ప్రశ్నించాడు. దీనికి అమర్‌దీప్ పేరు చెప్పాడు సందీప్. దీనికి శివాజీ భగ్గుమన్నాడు. శోభా, ప్రియాంక, అమర్‌దీప్‌లతో సందీప్ కుమ్మక్కయ్యాడని శివాజీ ఆరోపించాడు. అయినా ఈ గోల అంతా నాకెందుకు నేను వెళ్లిపోతానని బిగ్‌బాస్‌తో శివాజీ చెప్పాడు. తర్వాత రెండో పవర్ అస్త్ర కోసం మరో టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. గార్డెన్ ఏరియాలో అమర్చిన చెవిలో బిగ్‌బాస్ అని గట్టిగా మూడుసార్లు అరవాలని.. ఎవరైతే పెద్దగా అరుస్తారో వాళ్లు గెలిచినట్లని చెప్పాడు. శివాజీ, షకీలా, అమర్‌దీప్‌లు ఈ పోటీలో పాల్గొని గట్టిగా అరిచారు. అయితే విజేతగా ఎవరు నిలిచారు అనేది నాగ్ ప్రకటిస్తారని బిగ్‌బాస్ తెలిపారు.
ఇకపోతే.. రెండో వారం శివాజీ, ప్రిన్స్ యావర్, ప్రశాంత్, షకీలా, శోభా శెట్టి, అమర్‌దీప్, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ, రతిక నామినేషన్స్‌లో ఉన్నారు. రెండు రోజుల్లో వీకెండ్ రాబోతూ వుండటంతో వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఉత్కంఠగా మారింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com