బాలయ్య సినిమాతోనే దక్కింది

  • IndiaGlitz, [Monday,January 22 2018]

పురియాదా పుదిర్' (1990) చిత్రంతో తమిళ ఇండస్ట్రీలో దర్శకుడిగా అడుగుపెట్టారు కె.ఎస్.రవికుమార్.. ఆ త‌రువాత 'ముత్తు', అవ్వై షణ్ముగి' (భామనే సత్యభామనే'), పడయప్ప' (నరసింహా'), పంచతంతిరం' (పంచతంత్రం') వంటి సినిమాలతో తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన సినిమాలు తెలుగులో అనువదింపబడి విజయాలు సాధిస్తుండడంతో.. టాలీవుడ్‌లో కూడా తన హవా చాటాలనుకున్న ఈ ద‌ర్శ‌కుడికి.. తెలుగులో నేరుగా చేసిన‌ స్నేహంకోసం' (చిరంజీవి), బావనచ్చాడు' (నాగార్జున), విలన్' (రాజశేఖర్) సినిమాలు ఆశించినంత విజయాన్ని అందించలేకపోయాయి.

దీంతో.. మ‌ళ్ళీ తెలుగు సినిమా వైపు దృష్టి పెట్ట‌లేదాయ‌న‌. సుమారు 15 సంవత్సరాల విరామం అనంతరం.. బాలకృష్ణతో జై సింహా' సినిమాను తెరకెక్కించారు రవికుమార్. ఈ సంక్రాంతి బరిలో విడుదలైన అన్ని సినిమాల్లోనూ హిట్ చిత్రంగా నిలిచి.. దర్శకుడిగా తెలుగులో కూడా విజయం సాధించాలనుకున్న ర‌వికుమార్ కలను నెరవేర్చింది ఈ చిత్రం. అంతేకాకుండా.. తొమ్మిది సంవత్సరాల గ్యాప్ తర్వాత కె.ఎస్‌.ర‌వికుమార్‌కి ద‌క్కిన హిట్ చిత్ర‌మిది. ద‌ర్శ‌కుడిగా ఆయ‌న‌ ఆఖరి హిట్ చిత్రం ఆద‌వన్' (ఘటికుడు). ఆసక్తికరమైన విశేషమేమిటంటే...ఈ రెండు చిత్రాల్లోనూ నయనతార కథానాయిక కావడం.

More News

తేజని గట్టెక్కించిన వెంకీ నిర్ణయం

విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటించిన 'గురు'సినిమా విడుదలై దాదాపు ఏడాది కావస్తోంది.

ఏడు భాషల్లో అల్లు అర్జున్ సందడి

'ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు'..ఈ మాట స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కి సరిగ్గా సరిపోతుంది.

వాలీబాల్ ఆట నేపథ్యంలో..

బెల్లంకొండ శ్రీనివాస్..నటించింది మూడు సినిమాలే అయినా తనకంటూ ఒక ఇమేజ్ ని సొంతం చేసుకున్న యువ కథానాయకుడు.

మార్చిలో 'టాక్సీవాలా'

సంచ‌ల‌న విజ‌యం సాధించిన 'అర్జున్ రెడ్డి' సినిమా తర్వాత.. ఆ చిత్ర క‌థానాయ‌కుడు విజయ్ దేవరకొండ తదుపరి చిత్రం ఎప్పుడు వస్తుందా అని అత‌ని అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ప్ర‌స్తుతం విజ‌య్ అర‌డ‌జ‌ను చిత్రాల‌తో బిజీగా ఉన్నా.. వీటిలో 'టాక్సీవాలా' ముందుగా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

మళ్ళీ బాలయ్య తోనే..

కొన్ని హిట్ కాంబినేషన్లు వెండితెరపై రిపీట్ అయితే చాలు..సినిమా ఫలితం గురించి పెద్దగా ఆలోచించక్కర్లేదు.