పోలీసు బూటును ముద్దాడిన గోరంట్ల... పద్దతి మార్చుకోవాలని జెసి కి వార్నింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
మాజీ ఎంపి జేసీ దివాకర్ రెడ్డి పోలీసులపై చేసిన వ్యాఖ్యల పై వినూత్న నిరసన తెలిపారు వైసీపీ ఎంపి గోరంట్ల మాధవ్. పోలీసు బూట్ ను తుడిచి పాలిష్ చేసిన గోరంట్ల....ఇలా చేసినందుకు చాలా గర్వపడతున్నాను అన్నారు. మనకు రక్షణ ఇస్తున్న పోలీసులు... పునర్జన్మ ఇస్తున్నారని జేసీ గుర్తు పెట్టకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలా కాకుండా ఇంత నీచంగా మాట్లాడడం దిగ జారుడు తనానికి నిదర్శనం అన్నారు. అనంతపురం జిల్లాలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి అంటే అందుకు కారణం పోలీసులే అనే విషయం కూడా జెసి కి తెలియదా అన్నారు.
జెసి అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు.... మాజీ సీఎం చంద్రబాబుకు నవ్వు ఎలా వచ్చిందని ప్రశ్నించారు గోరంట్ల. ఇప్పటికే జెసి కథ ముగిసిందని... ఎన్నికల్లో అతని కొడుకు రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడిందని విమర్శించారు. ఇప్పటికైనా జెసి తన పద్దతి మార్చుకోవాలని... లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఎన్ని తిట్టినా పోలీసులు పట్టించుకోరు అనుకుంటే పొరపాటే అని... పోలీసుల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎంపీ లు కూడా ఉంటారని ... తను కూడా అలాగే వచ్చానని గోరంట్ల పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments