పోలీసు బూటును ముద్దాడిన గోరంట్ల... పద్దతి మార్చుకోవాలని జెసి కి వార్నింగ్

మాజీ ఎంపి జేసీ దివాకర్ రెడ్డి పోలీసులపై చేసిన వ్యాఖ్యల పై వినూత్న నిరసన తెలిపారు వైసీపీ ఎంపి గోరంట్ల మాధవ్. పోలీసు బూట్ ను తుడిచి పాలిష్ చేసిన గోరంట్ల....ఇలా చేసినందుకు చాలా గర్వపడతున్నాను అన్నారు. మనకు రక్షణ ఇస్తున్న పోలీసులు... పునర్జన్మ ఇస్తున్నారని జేసీ గుర్తు పెట్టకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలా కాకుండా ఇంత నీచంగా మాట్లాడడం దిగ జారుడు తనానికి నిదర్శనం అన్నారు. అనంతపురం జిల్లాలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి అంటే అందుకు కారణం పోలీసులే అనే విషయం కూడా జెసి కి తెలియదా అన్నారు.

జెసి అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు.... మాజీ సీఎం చంద్రబాబుకు నవ్వు ఎలా వచ్చిందని ప్రశ్నించారు గోరంట్ల. ఇప్పటికే జెసి కథ ముగిసిందని... ఎన్నికల్లో అతని కొడుకు రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడిందని విమర్శించారు. ఇప్పటికైనా జెసి తన పద్దతి మార్చుకోవాలని... లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఎన్ని తిట్టినా పోలీసులు పట్టించుకోరు అనుకుంటే పొరపాటే అని... పోలీసుల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎంపీ లు కూడా ఉంటారని ... తను కూడా అలాగే వచ్చానని గోరంట్ల పేర్కొన్నారు.

More News

తుగ్లక్ డైలాగులు చెల్లవు... రాజధాని మార్పు మీ ఇష్టం కాదు అంటూ జగన్ కు ఉమా వార్నింగ్

ఏపీ రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపై ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయ్.

ప్రభాస్ అభిమానులకు నిరాశే... జాన్ రిలీజ్ కు మరో ఏడాది ?

ప్రభాస్.... పాన్ ఇండియా స్టార్. బాహుబలి సినిమాతో ఇంటర్నేషనల్ స్టార్ డమ్ తెచ్చుకున్న రెబల్ స్టార్.

రౌడీ హీరో కు తల్లిగా రాజమాత...?

టాలీవుడ్ మోస్ట్ పాపులర్ హీరో విజయ్ దేవరకొండ.... బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అన్ని ఇండస్ట్రీల్లోనూ మంచి ఫాలోయింది ఉన్న హీరో.

డిజిట‌ల్ రంగంలోకి మ‌రో హీరోయిన్‌..

`అలా ఎలా?`తో హీరోయిన్‌గా  తెలుగులో కెరీర్‌ను స్టార్ట్ చేసిన హెబ్బా ప‌టేల్  నెక్ట్స్ మూవీ `కుమారి 21 ఎఫ్‌`,

అడివి శేష్‌తో అలియా.. టాలీవుడ్‌లో మరోసారి మెరవనుందా?

అడివి శేష్.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు కూడా శేష్‌ ప్రాజెక్టులపై ఆసక్తి చూపుతున్నాయి.