గోపీ హ్యాట్రిక్ సాధిస్తాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు', 'భలే భలే మగాడివోయ్' వంటి హిట్ చిత్రాల కోసం సంగీత దర్శకుడుగా తన సత్తా చాటుకున్నాడు గోపీసుందర్. మలయాళంలో ప్రముఖ సంగీత దర్శకుడైన గోపీ.. ఈ ఏడాదిలో రిలీజైన పై రెండు తెలుగు చిత్రాలతో ఇక్కడా చక్కని గుర్తింపుని తెచ్చుకున్నాడు. వీనులవిందైన సంగీతాన్ని అందించడంలో సిద్ధహస్తుడైన గోపీ.. ఈ సంవత్సరంలో ముచ్చటగా మూడోసారి మరో తెలుగు సినిమాతో పలకరించనున్నాడు.
ఆ సినిమానే 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు'. రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాతో గోపీ మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకుంటే గనుక.. తెలుగు పరిశ్రమకు పరిచయమైన ఏడాదిలోనే హ్యాట్రిక్‌ని సొంతం చేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్‌గా గోపీ గుర్తుండిపోతాడు. గమనించదగ్గ విషయమేమిటంటే.. ఈ మూడు సినిమాల టైటి్ల్స్ హిట్ పాటల పల్లవిలోనుంచి పుట్టుకొచ్చినవే కావడం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com