'ఇష్టంగా.. సంతోషంగా..ఆనందంగా' అంటున్న ర‌చ‌యిత‌

  • IndiaGlitz, [Saturday,February 17 2018]

కథా రచయితలు దర్శకులుగా మారడం అన్నది తెలుగు సినీ పరిశ్రమకు కొత్తేమీ కాదు. నిన్నటి తరం సీనియర్ దర్శకులు దాసరి నారాయణరావు, జంధ్యాల నుంచి నేటి తరం డైరెక్టర్ వక్కంతం వంశీ వరకు చాలా మంది రచయితలుగా కెరీర్‌ను ఆరంభించి అనంత‌రం దర్శకులుగా రూపాంతరం చెందినవారే. అయితే వారిలో...కెరీర్‌లో విజయం సాధించి ముందుకు సాగుతున్నవారు మాత్రం నేటి తరంలో తక్కువనే చెప్పాలి.

అలా కెరీర్‌ను విజయవంతంగా మలుచుకుని సక్సెస్ ఫుల్ డైరెక్టర్లుగా వెలుగుతున్న వారు త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ. ఇక వీరి బాటలోనే నడవడానికి మ‌రో ప్ర‌ముఖ ర‌చ‌యిత ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. 'సంతోషం', 'ఢీ', 'దూకుడు', 'బాద్ షా', 'అల్లుడు శ్రీను' వంటి విజ‌య‌వంత‌మైన‌ చిత్రాలకు రచయితగా పనిచేసిన గోపి మోహన్ ఇప్పుడు మెగా ఫోన్ పట్టనున్నారు.

గతంలో కోన వెంకట్‌తో కలిసి పనిచేసిన ఈ కథా రచయిత.. కోన వెంకట్ డైలాగ్స్ చూసుకోగా...త‌ను స్క్రీన్ ప్లే పై దృష్టి సారిస్తూ ఉండేవారు. ఇప్పుడు ఆ అనుభవంతోనే దర్శకత్వపు బాధ్యతను తీసుకోబోతున్నారని సమాచారం. ఆయన డైరెక్ట్ చేయబోయే సినిమాకి 'ఇష్టంగా.. సంతోషంగా..ఆనందంగా' అనే టైటిల్ ని ఫిక్స్ చేసారని టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విషయాలు గోపి మోహన్ త్వరలోనే వెల్లడించనున్నారు.

More News

ముచ్చటగా మూడోసారి నానితో..

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నారు నిర్మాత దిల్ రాజు.

'ఐతే 2.ఓ' మోషన్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

ఇంద్రనీల్‌ సేన్‌గుప్తా, జారా షా, అభిషేక్‌, కర్తవ్య శర్మ, నీరజ్‌, మృణాల్‌, మృదాంజలి కీలక పాత్రధారులుగా రాజ్‌ మాదిరాజు దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఐతే 2.ఓ'. ఫర్మ్‌ 9 పతాకంపై కె.విజయరామారాజు, హేమంత్‌ వల్లపురెడ్డి నిర్మిస్తున్నారు. శనివారం ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో ఈ చిత్రం మోషన్‌ పోస్టర్‌, టీజర్‌ను నిర్మాత రాజ్‌ కందుకూరి, దర్శకురా

మలయాళ బ్లాక్ బస్టర్ 'ఆనందం' .. ఇప్పుడు తెలుగులో!

కాలేజీ నేపథ్యంలో కథలు అల్లుకుని యువత మనసులకు హత్తుకునేటట్టు తెరకెక్కించిన ప్రతిసారీ విజయం తథ్యం.

ఆశాభోస్లేకి య‌శ్ చోప్రా జాతీయ అవార్డు ప్ర‌దానం..!

లెజండ‌రి సింగ‌ర్ ఆశాభోస్లేకి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన య‌శ్ చోప్రా మెమురియ‌ల్ జాతీయ అవార్డు 2018ని టి.సుబ్బిరామిరెడ్డి ఫౌండేష‌న్  ఫిబ్ర‌వ‌రి 16న ముంబాయిలోని ఓ ప్ర‌ముఖ హోట‌ల్ లో ప్ర‌దానం చేసారు.

'మా' నాట‌కోత్స‌వాలు 'గుర్తు తెలియ‌ని శవం' నాటిక ప్ర‌ద‌ర్శ‌న‌!

'మా' (మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్) ర‌జ‌తోత్స‌వ వేడుక‌ల్లో భాగంగా... కీ..శే..డా..డి.రామానాయుడు 3 వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా 'మా' ఆధ్వ‌ర్యంలో మూడు రోజుల పాటు ( 16,17,18 తేదీల్లో) భాగంగా త‌ల‌పెట్టిన నాట‌కోత్స‌వాలు శుక్ర‌వారం సాయంత్రం హైద‌రాబాద్  ఫిల్మ్ న‌గర్ హౌసింగ్ సోసైటీ కాంప్లెక్స్ లో ప్రారంభ‌మ‌య్యాయి