గోపీచంద్ వర్సెస్ విజయ్ దేవరకొండ
Send us your feedback to audioarticles@vaarta.com
మూడున్నరేళ్ళ క్రితం వచ్చిన లౌక్యం` చిత్రంతో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు యాక్షన్ హీరో గోపీచంద్. ఆ తర్వాత ఆయన నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయాయి. ప్రస్తుతం యాక్షన్, కామెడీలను మిళితం చేసి దర్శకుడు చక్రి తెరకెక్కిస్తున్న పంతం`లో గోపీచంద్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో గోపీచంద్ ఎన్.ఆర్.ఐ.పాత్రలో కనిపిస్తున్నారు.
ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తప్పకుండా విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు గోపీచంద్. అంతేగాకుండా, ఇది గోపీకి 25వ చిత్రం కావడం విశేషం. కాగా, ఈ సినిమాని మే 18న విడుదల చేయనున్నారు. ఇదిలా వుంటే... ఇదే రోజున వరుస హిట్లతో దూసుకుపోతున్న యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ కొత్త చిత్రం టాక్సీవాలా` (ప్రచారంలో ఉన్న పేరు) కూడా విడుదల కానుంది. అర్జున్ రెడ్డి` లాంటి సంచలన విజయం సాధించిన చిత్రం తరువాత వస్తున్న సినిమా కావడంతో.. టాక్సీవాలా`పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొత్తమ్మీద ఫామ్ కోల్పోయిన హీరో, ఫామ్లో ఉన్న హీరో ఒకే రోజున తమ కొత్త చిత్రాలతో సందడి చేయనున్నారన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com