గోపీచంద్ వర్సెస్ విజయ్ దేవరకొండ

  • IndiaGlitz, [Saturday,February 24 2018]

మూడున్న‌రేళ్ళ క్రితం వ‌చ్చిన లౌక్యం' చిత్రంతో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు యాక్షన్ హీరో గోపీచంద్. ఆ తర్వాత ఆయన న‌టించిన‌ సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయాయి. ప్రస్తుతం యాక్షన్, కామెడీలను మిళితం చేసి దర్శకుడు చక్రి తెరకెక్కిస్తున్న పంతం'లో గోపీచంద్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో గోపీచంద్ ఎన్.ఆర్.ఐ.పాత్రలో కనిపిస్తున్నారు.

ఈ యాక్షన్ ఎంటర్‌టైన‌ర్‌ తప్పకుండా విజయం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కంతో ఉన్నారు గోపీచంద్. అంతేగాకుండా, ఇది గోపీకి 25వ చిత్రం కావ‌డం విశేషం. కాగా, ఈ సినిమాని మే 18న విడుదల చేయనున్నారు. ఇదిలా వుంటే... ఇదే రోజున వరుస హిట్లతో దూసుకుపోతున్న యువ క‌థానాయ‌కుడు విజయ్ దేవరకొండ కొత్త చిత్రం టాక్సీవాలా' (ప్రచారంలో ఉన్న పేరు) కూడా విడుదల కానుంది. అర్జున్ రెడ్డి' లాంటి సంచలన విజయం సాధించిన చిత్రం తరువాత వ‌స్తున్న సినిమా కావ‌డంతో.. టాక్సీవాలా'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొత్త‌మ్మీద ఫామ్ కోల్పోయిన హీరో, ఫామ్‌లో ఉన్న హీరో ఒకే రోజున త‌మ కొత్త చిత్రాల‌తో సంద‌డి చేయ‌నున్నార‌న్న‌మాట‌.

More News

మార్చి 9న 'ఏ మంత్రం వేశావే'

పెళ్లిచూపులు,అర్జున్ రెడ్డి చిత్రాలతో యువతలో కథానాయకుడు విజయ్ దేవరకొండ సంపాందించిన పాపులారిటీ అంతా ఇంతా కాదు.

'ఛల్ మోహన్ రంగ' తొలి గీతం విడుదల

'గ ఘ మేఘ ..నింగే మనకు నేడు పాగ' అంటూ మన యువ కథానాయకుడు నితిన్ కథానాయిక మేఘా ఆకాష్ తో

పాత వాటిని వాడేసుకుంటున్న నితిన్

‘జయం’(2002)సినిమాతో కథానాయకుడిగా పరిచయమై..తొలిచిత్రంతోనే తన ఖాతాలో ఘన విజయాన్ని నమోదు చేసుకున్నాడు యంగ్ హీరో నితిన్.

బన్నీ ఖాతాలో మరొకటి

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేరు చెబితే గుర్తుకొచ్చే చిత్రం 'ఆర్య'.

సుబ్బలక్ష్మీగా అనుపమ

అనుపమ పరమేశ్వరన్...చేసినవి నాలుగే నాలుగు తెలుగు సినిమాలు అయినా..