'పంతం' తో గోపీచంద్ సందేశం

  • IndiaGlitz, [Wednesday,March 28 2018]

యాక్షన్ చిత్రాల క‌థానాయ‌కుడు గోపీచంద్, హ్యాట్రిక్ విజ‌యాల క‌థానాయిక‌ మెహరీన్ జంటగా నూతన దర్శకుడు కె.చ‌క్ర‌వ‌ర్తి (చ‌క్రి) తెరకెక్కిస్తున్న చిత్రం ‘పంతం’. ఫ‌ర్ ఎ కాజ్ అనేది ఉప‌శీర్షిక‌.  శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై రాధామోహన్ ఈ సినిమాని నిర్మిస్తుండ‌గా.. గోపీ సుందర్ సంగీతమందిస్తున్నారు. ఇందులో.. ఎన్.ఆర్.ఐ.గా, అవినీతి పరులైన రాజకీయనాయకులపై ఎదురు తిరిగే వ్యక్తిగా రెండు పార్శ్వాలున్న పాత్రలో గోపీచంద్ కనిపించనున్నారు.

అంతేగాకుండా.. ఓ సామాజిక సందేశాన్ని కూడా ఈ సినిమా ద్వారా ఇవ్వనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ – అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో మెహరీన్ టీచర్ పాత్ర పోషిస్తోంది. గోపీచంద్ సిల్వర్ జూబ్లీ ఫిల్మ్‌ (25వ చిత్రం)గా రూపుదిద్దుకుంటున్న ఈ  యాక్షన్ ఎంటర్‌టైనర్ వేసవి సందర్భంగా మే 18న విడుదల కానుంది. 'లౌక్యం' త‌రువాత స‌రైన విజ‌యం లేని గోపీచంద్‌కు ఈ సినిమా విజ‌యం కీల‌కంగా మారింది.

More News

#RRR లో విల‌న్‌గా రాజశేఖర్?

నిన్నటి తరం కథానాయకుల్లో కొంతమంది.. ప్రతినాయక ఛాయలున్న పాత్రల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

నిర్మాత‌గా మారుతున్న బాబీ...

'ప‌వ‌ర్‌', 'స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌', 'జై ల‌వ‌కుశ' చిత్రాల‌తో డైరెక్ట‌ర్‌గా త‌న స్టామినాను ప్రూవ్ చేసుకున్న ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వీంద్ర (బాబి).

సైరాలో అమితాబ్ లుక్ ఎలా ఉంటుందంటే...

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’.

డైరెక్ష‌న్ ఆలోచ‌నలో యంగ్ హీరో....

అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు, మెంట‌ల్ మ‌దిలో, నీది నాది ఒకే క‌థ సినిమాల్లో న‌టించిన త‌న‌కంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న న‌టుడు శ్రీవిష్ణు.

వెబ్ సిరీస్‌లో అమీర్ ఖాన్‌...

ప‌లు వివాదాల‌కు కేంద్ర బిందువుగా నిలిచిన ఓషో 1990లో క‌న్నుమూశారు.