స్పీడు పెంచిన గోపీచంద్...
Send us your feedback to audioarticles@vaarta.com
గోపీచంద్ నటించిన తాజా చిత్ర సౌఖ్యం. ఈ చిత్రాన్ని ఎ.ఎస్.రవికుమార్ తెరకెక్కించారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 13న ఆడియోను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. సౌఖ్యం సినిమాని క్రిస్మెస్ కానుకగా ఈనెల 25న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే...సౌఖ్యం రిలీజ్ అయిన వెంటనే గోపీచంద్ ఎ.ఎం.రత్నం తనయుడు జ్యోతిక్రిష్ణ దర్శకత్వంలో ఓ మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇటీవల కథ చెప్పిన జ్యోతిక్రిష్ణకు ఓకె చెప్పడంతో జనవరి నుంచి సినిమా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మించనున్నట్టు సమాచారం. ఇటీవల లౌక్యం తో సక్సెస్ సాధించి సౌఖ్యంతో ప్రేక్షకుల ముందుకు వస్తూ..స్పీడు పెంచి వరుసగా సినిమాలు చేస్తున్న గోపీచంద్ ఆల్ ద బెస్ట్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com