క్లైమాక్స్‌లో గోపీచంద్ 'సీటీమార్‌'

  • IndiaGlitz, [Friday,January 01 2021]

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘సీటీమార్‌’. ఈ సినిమాలో ఆంధ్ర ఫీమేల్ క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ ఫీమేల్ క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా మిల్కీ బ్యూటీ ‌త‌మ‌న్నా న‌టిస్తున్నారు.

ఇప్ప‌టికే ఈ సినిమా నుండి విడుద‌ల‌చేసిన ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, జ్వాలా రెడ్డిగా త‌మ‌న్నాలుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా ఈ రోజు న్యూ ఇయ‌ర్ విషెస్‌తో ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసి అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింది చిత్ర యూనిట్‌. ప్ర‌స్తుతం చెవెళ్ల‌లో వేసిన భారీ సెట్లో ఫైట్ మాస్ట‌ర్ వెంక‌ట్ సార‌థ్యంలో మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది భారీ ఎత్తున యాక్ష‌న్ ఎపిసోడ్స్‌ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సెట్లోనే కేక్ క‌ట్ చేసి న్యూ ఇయ‌ర్ ని సెల‌బ్రేట్ చేసుకున్నారు చిత్ర యూనిట్‌. ఈ నెల 30 వ‌ర‌కు జ‌రిగే ఈ షెడ్యూల్‌తో ఒక పాట మిన‌హా చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంది.

భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకం పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. మెలొడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో ప‌ల్లెటూరి అమ్మాయి గా ఒక ప్రత్యేక పాత్రలో హీరోయిన్ దిగంగ‌న న‌టిస్తుండ‌గా భూమిక కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది.

ముఖ్యమైన పాత్రల్లో పోసాని కృష్ణముర‌ళి, రావు ర‌మేష్‌‌, రెహ‌మాన్, బాలీవుడ్ యాక్టర్ త‌రుణ్ అరోరా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటొగ్రఫి: ఎస్‌. సౌందర్‌ రాజన్‌, సంగీతం: మ‌ణిశ‌ర్మ‌, ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు, ఆర్ట్‌ డైరెక్టర్‌: సత్యనారాయణ డి.వై, స‌మ‌ర్పణ: పవన్‌ కుమార్, నిర్మాత‌: శ్రీనివాసా చిట్టూరి, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సంపత్‌ నంది.

More News

'క్రాక్‌' ట్రైలర్‌.. పక్కా మాస్‌

మాస్‌ మహారాజా రవితేజ సినిమా ఉండాలని ఆయన అభిమానులు కోరుకుంటారో అలాంటి మాస్‌ అండ్‌ యాక్షన్‌ ఎలిమెంట్స్‌తో రూపొందిన చిత్రం 'క్రాక్‌'..

కరోనాతో వైసీపీ ఎమ్మెల్సీ మృతి

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారితో వైసీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మృతి చెందారు. గత నెల 13న కరోనా చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు.

టీపీసీసీ చీఫ్ ఎవరో తేలకముందే.. కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్

పీసీసీ చీఫ్ ఎవరికి ఇవ్వాలనే దానిపై ఒకవైపు చర్చలు జరుగుతుండగానే.. కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరికపై నిర్ణయాన్ని ప్రకటించడం

కులాంతర వివాహం చేసుకున్నాడని.. వెంటాడి మరీ హతమార్చారు

పరువు హత్యలు ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోతున్నాయి. టెక్నాలజీ పరంగా రోజురోజుకూ అడుగులు ముందుకు పడుతుంటే.. కులం, మతం విషయంలో మాత్రం వెనక్కి పడుతున్నాయి.

‘రాధేశ్యామ్’ ప్రభాస్ లేటెస్ట్ లుక్.. విడుదల తేదీ ఫిక్స్?

‘సాహో’ తరువాత యంగ్ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ వరుస సినిమాలను లైన్‌లో పెట్టేశాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా 'జిల్‌' ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో లేటెస్ట్‌ మూవీ 'రాధేశ్యామ్' తెరకెక్కుతున్న విషయం