'పంతం' .. నా కెరీర్‌లో బెస్ట్ చిత్రం - గోపీచంద్
Send us your feedback to audioarticles@vaarta.com
ఎగ్రెసివ్ హీరో గోపీచంద్, మెహరీన్ హీరో హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.చక్రవర్తి దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన చిత్రం 'పంతం'. ఫర్ ఎ కాస్.. ఉప శీర్షిక. ఈ సినిమా జూలై 5న విడుదలైంది. ఈ సందర్భంగా సోమవారం జరిగిన సక్సెస్‌మీట్‌లో....
ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ మాట్లాడుతూ - "మంచి చేశానని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. అందరూ చూడాల్సిన సినిమా. సమాజానికి ఇలాంటి సందేశాలు కావాలి. ఇలాంటి సినిమా చేసినందుకు చాలా మంది ఫోన్ చేసి అభినందించారు. దర్శకుడు చక్రి సినిమాను అద్భుతంగా.. చెప్పింది చెప్పినట్లుగా తెరకెక్కించారు. నా కెరీర్‌లో ఇది బెస్ట్ చిత్రంగా నిలుస్తుంది. నిర్మాత రాధామోహన్‌గారు మంచి అవుట్ పుట్ రావాలని మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కించారు. ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేస్తే మరిన్ని సందేశాత్మక చిత్రాలు వస్తాయి" అన్నారు.
నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ - "కథ వినగానే గోపీచంద్‌గారైతే సరిపోతారని ఆయనకు కథ చెప్పడం జరిగింది. ఆయనకు కూడా నచ్చడంతో సినిమా స్టార్ట్ చేశాం. ఆయన కోసమే ఈ సినిమాను ఇంత గ్రాండ్‌గా నిర్మించాం. డైరెక్టర్ చక్రి కొత్తవాడైనా ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా సినిమాను తెరకెక్కించారు. మా బ్యానర్ విలువను పెంచే చిత్రమిది. మంచి కలెక్షన్స్ వస్తున్నాయి" అన్నారు.
హీరోయిన్ మెహరీన్ మాట్లాడుతూ - "ఇంత మంచి సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. సక్సెస్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. గోపీచంద్‌గారితో పనిచేయడం ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. దర్శక నిర్మాతల సహకారానికి థాంక్స్" అన్నారు.
డైరెక్టర్ కె.చక్రవర్తి మాట్లాడుతూ - "కొత్తవాడినైనా నన్ను నమ్మి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు.. నిర్మాత కె.కె.రాధామోహన్‌గారికి థాంక్స్. అన్ని ఏరియాల నుండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాకు ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్" అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రసాద్ మూరెళ్ల, భాస్కరభట్ల, రైటర్ రమేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments