గోపీచంద్, సంపత్ నంది.. మరోసారి
Send us your feedback to audioarticles@vaarta.com
‘రచ్చ’, ‘బెంగాల్ టైగర్’ లాంటి యాక్షన్ ఎంటర్టైనర్లను తెరకెక్కించిన యువ దర్శకుడు సంపత్ నంది.. ఆ చిత్రాల తరువాత యాక్షన్ హీరో గోపీచంద్‌తో ‘గౌతమ్‌నంద’ సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. అతి త్వరలో ఈ యంగ్ డైరెక్టర్.. మరోసారి గోపీచంద్‌తో జట్టు కట్టనున్నట్టు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.. గోపీచంద్ కెరీర్లో తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన సినిమా ‘గౌతమ్‌నంద’. వీటిలో ఒకటి హీరో పాత్ర కాగా.. మరొకటి విలన్ పాత్ర. ఇలా రెండు వైవిధ్యమైన పాత్రలతో తనని ఎంతో స్టైలిష్‌గా స్క్రీన్‌పై ప్రెజెంట్ చేసిన విధానం నచ్చి..
ఈ దర్శకుడితో మరోసారి కలిసి పని చేయాలని గోపీచంద్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ నిర్మాత సంపత్ నందితో కలిసి ‘బెంగాల్ టైగర్’ సినిమాను.. తాజాగా గోపీచంద్ హీరోగా ‘పంతం’ మూవీను నిర్మించారు. త్వరలోనే గోపీచంద్, సంపత్ నంది సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. గోపీచంద్ 25వ చిత్రం ‘పంతం’ జూలై 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments