గోపీచంద్, సంపత్ నంది కాంబినేషన్లో శ్రీ బాలాజీ సినీ మీడియా చిత్రం
Send us your feedback to audioarticles@vaarta.com
గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ మాస్ ఎంటర్ టైనర్ రూపొందనుంది. ఈ చిత్రాన్ని శంఖం, రెబల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ బాలాజీ సినీ మీడియా సంస్థ నిర్మిస్తుంది. జె.పుల్లారావు, జె.భగవాన్ సంయుక్తంగా ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు జె.పుల్లారావు, జె.భగవాన్ లు మాట్లాడుతూ...గోపీచంద్ లో ఉన్న మాస్ యాంగిల్ ను సరికొత్తగా ప్రజెంట్ చేసే చిత్రమిది. ఇప్పటి వరకు గోపీచంద్ చేసిన చిత్రాల కంటే హై బడ్జెట్ & హై టెక్నికల్ ఎలిమెంట్స్ తో ఈ మూవీని ప్రెస్టేజియస్ గా రూపొందిస్తున్నాం. సంపత్ నంది సూపర్బ్ స్టోరీ చెప్పారు. కథలో భాగంగా చిత్రీకరణ విదేశాల్లో జరుపుతాం. గోపీచంద్ లో మరో కొత్త యాంగిల్ ను ఈ చిత్రంలో చూస్తారు. కొంత మంది టెక్నిషియన్స్ ఫైనలైజ్ అయ్యారు. త్వరలోనే మిగిలిన టెక్నీషియన్స్ వివరాలు తెలియచేస్తాం అన్నారు.
గోపీచంద్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్ - బెజవాడ కోటేశ్వరరావు, ఎడిటర్ - గౌతంరాజు, సినిమాటోగ్రఫీ - ఎస్.సౌందర్ రాజన్, ఆర్ట్ - ఎ.ఎస్.ప్రకాష్, ఫైట్స్ - రామ్ లక్ష్మణ్, స్ర్కిప్ట్ కో ఆర్డినేటర్ - సుధాకర్ పావులూరి, నిర్మాతలు - జె.భగవాన్, జె.పుల్లారావు, కథ, స్ర్కీన్ ప్లే, మాటలు, దర్శకత్వం - సంపత్ నంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments