గోపీచంద్, సంప‌త్ నంది కాంబినేష‌న్లో శ్రీ బాలాజీ సినీ మీడియా చిత్రం

  • IndiaGlitz, [Wednesday,July 06 2016]

గోపీచంద్ హీరోగా సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో ఓ మాస్ ఎంట‌ర్ టైన‌ర్ రూపొందనుంది. ఈ చిత్రాన్ని శంఖం, రెబ‌ల్ చిత్రాల‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ బాలాజీ సినీ మీడియా సంస్థ నిర్మిస్తుంది. జె.పుల్లారావు, జె.భ‌గ‌వాన్ సంయుక్తంగా ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌లు జె.పుల్లారావు, జె.భ‌గ‌వాన్ లు మాట్లాడుతూ...గోపీచంద్ లో ఉన్న మాస్ యాంగిల్ ను స‌రికొత్త‌గా ప్ర‌జెంట్ చేసే చిత్ర‌మిది. ఇప్ప‌టి వ‌ర‌కు గోపీచంద్ చేసిన చిత్రాల కంటే హై బ‌డ్జెట్ & హై టెక్నిక‌ల్ ఎలిమెంట్స్ తో ఈ మూవీని ప్రెస్టేజియ‌స్ గా రూపొందిస్తున్నాం. సంప‌త్ నంది సూప‌ర్బ్ స్టోరీ చెప్పారు. క‌థ‌లో భాగంగా చిత్రీక‌ర‌ణ విదేశాల్లో జ‌రుపుతాం. గోపీచంద్ లో మ‌రో కొత్త యాంగిల్ ను ఈ చిత్రంలో చూస్తారు. కొంత మంది టెక్నిషియ‌న్స్ ఫైన‌లైజ్ అయ్యారు. త్వ‌ర‌లోనే మిగిలిన టెక్నీషియ‌న్స్ వివ‌రాలు తెలియ‌చేస్తాం అన్నారు.

గోపీచంద్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రానికి ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్ - బెజ‌వాడ కోటేశ్వ‌ర‌రావు, ఎడిట‌ర్ - గౌతంరాజు, సినిమాటోగ్ర‌ఫీ - ఎస్.సౌంద‌ర్ రాజ‌న్, ఆర్ట్ - ఎ.ఎస్.ప్ర‌కాష్, ఫైట్స్ - రామ్ ల‌క్ష్మ‌ణ్, స్ర్కిప్ట్ కో ఆర్డినేట‌ర్ - సుధాక‌ర్ పావులూరి, నిర్మాత‌లు - జె.భ‌గ‌వాన్, జె.పుల్లారావు, క‌థ, స్ర్కీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం - సంప‌త్ నంది.

More News

నాగ్ సరసన నటించేది ఎవరు..

కింగ్ నాగార్జున-దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందుతున్న మరో భక్తిరస చిత్రం ఓం నమో వెంకటేశాయ.

రజనీకాంత్ కి అసలు ఏమైంది..

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సంచలన చిత్రం కబాలి.ఈనెలలోనే కబాలి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.మరో వైపు రజనీకాంత్ గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రోబో 2.0చిత్రంలో నటిస్తున్నారు.

మెగా వేడుక‌కి ప్లాన్ - ఫ్యాన్స్ ని క‌లిసిన చ‌ర‌ణ్‌

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మెగా వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవ‌ల చ‌ర‌ణ్ ఫ్యాన్స్ ని క‌లిసారు.

అతిలోక సుంద‌రి చేతుల మీదుగా అవంతిక ఆడియో రిలీజ్

70 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రభుదేవా, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో విజయ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'అభినేత్రి'.

టాలీవుడ్ 2016 గ‌డిచిన 6 నెల‌ల స‌మీక్ష‌

జ‌న‌వ‌రి నుంచి జూన్ వ‌ర‌కు ఆశించిన స్ధాయిలో భారీ విజ‌యాలు సాధించ‌క‌పోయినా...ఈ సంవ‌త్స‌రం తెలుగు ఇండ‌స్ట్రీకి కొత్త ఊపిరి ని ఇచ్చింది. కంటెంట్ ఉంటే చాలు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌ధం ప‌డ‌తారు అని మ‌రోసారి నిరూపించింది.