నిర్మాత‌కు డ‌బ్బులు వెన‌క్కిచ్చేసిన గోపీచంద్‌?

  • IndiaGlitz, [Tuesday,August 25 2020]

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీంచ‌ద్ ఇప్పుడు సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా ‘సీటీమార్‌’ రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. ఈ సినిమా సెట్స్‌పై ఉండ‌గానే మ‌రో సినిమాకు ఓకే చెప్పారు. వివ‌రాల్లోకెళ్తే సీనియ‌ర్ నిర్మాత బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్ నిర్మాణంలో సుబ్ర‌మ‌ణియ‌న్ అనే త‌మిళ ద‌ర్శ‌కుడితో సినిమా చేయ‌డానికి గోపీచంద్ ఓకే చెప్పారు. అడ్వాన్స్ కూడా తీసుకున్నారు. సినిమా లాంఛనంగా కూడా ప్రారంభ‌మైంది. ఇప్పుడు గోపీచంద్‌, బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్‌ సినిమా ఆగిపోయింద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. కార‌ణాలు తెలియ‌డం లేదు కానీ.. స‌ద‌రు నిర్మాత‌కు హీరో గోపీచంద్ తీసుకున్న అడ్వాన్సు మ‌నీ తిరిగి ఇచ్చేశారట‌.

మ‌రి ఈ వార్త‌ల‌పై గోపీచంద్‌, ఇటు బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్ క్యాంప్ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి. ఇప్పుడు ఇదే క‌థ‌, ద‌ర్శ‌కుడితో బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్ మ‌రో హీరోతో ప్లాన్ చేస్తారా? లేక ప్రాజెక్ట్‌నే ప‌క్క‌న పెట్టేస్తారా? అనేది తెలియాలంటే మాత్రం వెయిటింగ్ త‌ప్ప‌దు. ఇక త‌మ‌న్నాతో గోపీచంద్ క‌లిసి న‌టించిన సీటీమార్ ఈ వేస‌విలో విడుద‌ల కావాల్సింది. కానీ క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో తుది ద‌శ చిత్రీక‌ర‌ణ ఆగింది. ఇందులో గోపీచంద్‌, త‌మ‌న్నా ఇద్ద‌రూ క‌బ‌డీ టీమ్ కోచ్‌లుగా క‌నిపించ‌బోతున్నారు.