జనతా గ్యారేజ్ చిత్ర బృందాన్ని అభినందించిన పుల్లెల గోపీచంద్ , పీవీ సింధు

  • IndiaGlitz, [Sunday,September 11 2016]

భారత దేశానికి ఎందరో ఛాంపియన్ ప్లేయర్స్ ను అందించిన కోచ్ మరియు ప్రముఖ బాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్. ఇటీవల జరిగిన ఒలింపిక్స్ లో భారత దేశానికి రజత పథకం అందించి, దేశానికే గర్వకారణం గా నిలిచిన ఆయన శిష్యురాలు పీవీ సింధు. నేడు హైదరాబాద్ లో వీరు, వీరి కుటుంబ సభ్యులు కలిసి జనతా గ్యారేజ్ చిత్రాన్ని తిలకించారు. వీరితో పాటు, ప్రముఖ వ్యాపారవేత్త మరియు హైదరాబాద్ బాడ్మింటన్ లీగ్ ప్రెసిడెంట్ చాముండేశ్వనాథ్ కూడా ఉన్నారు. ప్రసాద్ లాబ్స్ లో జనతా గ్యారేజ్ చిత్రాన్ని తిలకించిన వీరు, చిత్ర బృందాన్ని అభినందించారు.

పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ, " సినిమా చాలా బాగుంది. మంచి కథా బలం ఉన్న సినిమా. ఎన్టీఆర్, మోహన్ లాల్ ల నటన ఎంతగానో ఆకట్టుకుంది. ఇంత మంచి చిత్రాన్ని అందించిన చిత్ర బృందానికి, దర్శకులు కొరటాల శివ గారికి కంగ్రాట్యులేషన్స్" అని అన్నారు.

పీవీ సింధూ మాట్లాడుతూ, " నేను జనతా గ్యారేజ్ సినిమా ని బాగా ఎంజాయ్ చేశాను. ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్ చాలా బాగుంది. కంగ్రాట్స్ టు ది టీం", అని అన్నారు.