'పంతం' ప్రీ-రిలీజ్ వేడుక డిటైల్స్..
Send us your feedback to audioarticles@vaarta.com
యాక్షన్ చిత్రాల కథానాయకుడు గోపీచంద్, పంజాబి ముద్దుగుమ్మ మెహరీన్ జంటగా నటించిన చిత్రం 'పంతం'. "ఫర్ ఎ కాజ్" అన్నది ఉప శీర్షిక. గోపీచంద్ కెరీర్లో 25వ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకి డెబ్యూ డైరెక్టర్ కె.చక్రవర్తి దర్శకత్వం వహించారు.
ఈ చిత్రాన్ని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. గోపీ సుందర్ సంగీతం అందించిన పాటలు కూడా శ్రోతలను అలరిస్తున్నాయి. ఒక సోషల్ మెసేజ్‌తో ఈ సినిమాని దర్శకుడు తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకను ఈ నెల 30న హైదరాబాద్‌లోని సంధ్య కన్వెన్షన్ హాల్లో నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుంది. జూలై 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments