పోస్ట్ పోన్ అయిన 'పంతం'...
Send us your feedback to audioarticles@vaarta.com
యాక్షన్ హీరోగా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన గోపీచంద్‌కు 'జిల్' (2015) సినిమాతో విజయాలకు బ్రేక్ పడింది. ఆ తర్వాత వచ్చిన 'సౌఖ్యం', 'గౌతమ్ నంద', 'ఆక్సిజన్' చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా దెబ్బతిన్నాయి.
ఈ పరాజయాలతో వెనుకబడిపోయిన గోపీచంద్.. ప్రస్తుతం నూతన దర్శకుడు చక్రి దర్శకత్వంలో 'పంతం' సినిమాను చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో ఎన్.ఆర్.ఐ. పాత్ర పోషిస్తున్నారు గోపీచంద్. ఆయన సరసన మెహ్రీన్ కథానాయికగా నటిస్తోంది. గోపి సుందర్ స్వరాలు సమకూరుస్తున్నారు.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై రాధామోహన్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ వేసవి సందర్భంగా మే 18న విడుదల కావాల్సింది. కానీ తాజా సమాచారం ప్రకారం సినిమాను జూన్ 22న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments