'విలనిజం నేనెప్పుడో చేసి వదిలేశా '.. ఆకట్టుకుంటోన్న గోపీచంద్ పక్కా కమర్షియల్ టీజర్
Send us your feedback to audioarticles@vaarta.com
కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే హీరో గోపీచంద్. ఈయన తాజాగా నటిస్తున్న సినిమా ‘‘ పక్కా కమర్షియల్ ’’. ఈ మధ్యే సీటీమార్ సినిమాతో పర్లేదనిపించిన గోపీ.. ఆ తర్వాత ఆరడుగుల బుల్లెట్ సినిమాతో వచ్చాడు. అయితే ఆ సినిమా వచ్చినట్లు కూడా జనాలకు తెలియదు. రకరకాల కారణాలతో నాలుగేళ్ళ పాటు విడుదలకు నోచుకోని ఈ చిత్రాన్ని ప్రేక్షకులు కూడా పట్టించుకోలేదు. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా ఇప్పుడు ‘‘ పక్కా కమర్షియల్ ’’ అంటూ వస్తున్నాడు గోపీచంద్.
ప్రతి రోజు పండగే లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు మారుతి పక్కా కమర్షియల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు . ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. తాజాగా చిత్ర యూనిట్ పక్కా కమర్షియల్ టీజర్‌ను విడుదల చేసింది. ‘ఎవరికి చూపిస్తున్నారు సార్ మీ విలనిజం.. మీరు ఇప్పుడు చేస్తున్నారు నేను ఎప్పుడో చూసి చేసి వదిలేసాను..’ అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటోంది. టీజర్‌ను చూస్తుంటే గోపీచంద్ క్యారెక్టర్‌ను మారుతి అద్భుతంగా డిజైన్ చేసినట్లే కనిపిస్తోంది. ‘ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ పెట్టకూడదు.. ఇలా పెట్టాలి’ అంటూ హీరోయిన్ రాశీఖన్నా కూడా కామెడీ చేయడం గమనించవచ్చు. కోర్టు నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో గోపీచంద్, రాశీఖన్నా లాయర్లుగా కనిపించనున్నారు. భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే లాంటి విజయాలతో అపజయమే లేని జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ – బన్నీవాసు – కాంబినేషన్లో ‘‘ పక్కా కమర్షియల్ ’’ వస్తుండటంతో ఈ సినిమాపై పరిశ్రమలో అంచనాలు భారీగా వున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com