'ఆక్సిజన్ ' రిలీజ్ డేట్

  • IndiaGlitz, [Sunday,July 09 2017]

ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం 'ఆక్సిజన్‌'. ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ చిత్రం ఆగ‌స్ట్ 18న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. ముంబై, గోవా, సిక్కిం, చెన్నై వంటి ప్రాంతాల్లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంది. ఎప్పుడో చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకోవ‌డంలో ఆల‌స్య‌మైంది. ఎట్ట‌కేల‌కు నిర్మాత‌లు ఈ సినిమాను ఆగ‌స్ట్ 18న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. రాశిఖ‌న్నా, అను ఇమ్మాన్యుయ‌ల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.