డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల్లో గోపీచంద్ 'ఆక్సిజన్'

  • IndiaGlitz, [Saturday,August 13 2016]

ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం 'ఆక్సిజన్‌. ప్ర‌స్తుతం ఈ సినిమా డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. ఈ సందర్భంగా...

నిర్మాత ఎస్‌.ఐశ్వ‌ర్య మాట్లాడుతూ 'గోపీచంద్ హీరోగా మేం రూంపొందిస్తున్నాఆక్సిజ‌న్ చిత్రం ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఇప్ప‌టి వ‌ర‌కు సినిమా 90 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. అలాగే చిత్రీక‌ర‌ణ‌కు స‌మాంత‌రంగా డబ్బింగ్ కార్య‌క్ర‌మాలు కూడా జ‌రుగున్నాయి. ఇప్ప‌టి వర‌కు ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని డిఫ‌రెంట్ పాయింట్‌తో సినిమా చేస్తున్నాం. సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇటీవల విడుదల చేసిన సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ చిత్రంలో రాశిఖన్నా, అను ఇమ్మాన్యువల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రముఖ నటుడు జగపతి బాబు కీలకపాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్ర చాలా హైలైట్ గా ఉంటుంది. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా సంగీతం సినిమాకు హైలైట్ గా నిలవనుంది. సెప్టెంబ‌ర్ నెల‌లో ఆడియో విడుద‌ల చేసి అదే నెల‌లో సినిమాను కూడా ప్రేక్ష‌కులు ముందుకు తీసుకు రావ‌డానికి ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.

గోపీచంద్‌, జగపతిబాబు, రాశిఖన్నా, అను ఇమ్మాన్యువల్, ,కిక్‌ శ్యామ్‌, ఆలీ, బ్రహ్మజీ, సితార, అభిమన్యుసింగ్, షాయాజీ షిండే,చంద్రమోహన్, సుధ, ప్రభాకర్, అమిత్, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: వెట్రి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, ఫైట్స్‌:పీటర్ హెయిన్, ఆర్ట్‌: మిలన్‌, నిర్మాత: ఎస్‌.ఐశ్వర్య, దర్శకత్వం: ఎ.ఎం.జోతికృష్ణ.

More News

నీజ‌త‌లేక ప్ర‌మోష‌న‌ల్ టైటిల్ సాంగ్ రిలీజ్

యంగ్‌ హీరో నాగశౌర్య హీరోగా పారుల్‌, సరయు హీరోయిన్స్‌గా శ్రీ సత్య విదుర మూవీస్‌ పతాకంపై లారెన్స్‌ దాసరి దర్శకత్వంలో జి.వి.చౌదరి, నాగరాజ్‌ గౌడ్‌ చిర్రా నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'నీ జతలేక'. కరుణాకర్‌ కంపోజ్‌ చేసిన ఈ సినిమా ప్రమోషనల్‌ టైటిల్‌ సాంగ్‌ను చిత్ర యూనిట్‌ శనివారం హైదరాబాద్‌ రేడియో సిటీలో విడుదల చేశారు.

చిన్నారి అభిమానిని చూసి చ‌లించిన రామ్‌

రామ్ అనే పేరు విన‌గానే అంద‌రికీ అంద‌మైన కుర్రాడి రూపం క‌ళ్ల‌ముందు క‌దులుతుంది. అంత‌క‌న్నా హుషారుగా ఉండే వ్య‌క్తిత్వం గుర్తుకొస్తుంది. కానీ శుక్రవారం విశాఖ వాసుల‌కు మాత్రం అత‌నిలోని మంచి మ‌న‌సు క‌నిపించింది. చిన్నారి బాధ‌ను చూసి చ‌లించిపోయి కంటికింద చెమ్మై చేరిన అత‌ని ఉదార‌త క‌ళ్ల‌ముందు సాక్షాత్కార‌మైంది. వివ‌రాల్లోకెళ&

బ‌న్ని స్టార్ హీరో కాదా..?

తెలుగులో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ అలియాస్ బ‌న్ని మెగా క్యాంప్ హీరో అయినా త‌న‌దైన క‌ష్టంతో ఓ క్రెడిబిలిటీ, ఇమేజ్ సంపాదించుకున్నాడు. అందుకు నిద‌ర్శనం స‌రైనోడు. మిక్స్‌డ్ టాక్ తో స్టార్ అయిన ఈ సినిమా వంద‌కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్స్ సాధించి బాక్సాఫీస్ వ‌ద్ద బ‌న్ని రేసుగుర్రం అని ప్రూవ్ చేసింది.

అప్పుడు ఎస్.వి.కృష్ణారెడ్డి.. ఇప్పుడు మారుతియా?

ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రాలు తీయడంలో పెట్టింది పేరుగా వరుస విజయాలు అందుకున్న దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి. ఆయన దర్శక్వంలో వచ్చిన మాయలోడు, రాజేంద్రుడు-గజేంద్రుడు, యమలీల, ఘటోత్కచుడు, శుభలగ్నం, ప్రేమకు వేళాయెరా, ఎగిరే పావురమా.. ఇలా ఒకటేమిటి ఏ సినిమా చేసిన సూపర్ హిట్టే అనే రీతిలో ఏకబిగిన విజయాలను అందుకున్నాడు.

జీవితం అంటే ఏమిటో ఎన్టీఆర్ కి అప్పుడు తెలిసింది అట..!

ఎన్టీఆర్ అంటే మంచి నటుడు అని తెలుసు...అంతకు మించి మంచి డ్యాన్సర్ అని తెలుసు..! జనతా గ్యారేజ్ ఆడియో ఫంక్షన్ లో ఎన్టీఆర్ ప్రసంగం విన్నాకా...ఎన్టీఆర్ అంటే మంచి పెర్ ఫార్మర్ & డ్యాన్సర్ మాత్రమే కాదు...