ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ డైరెక్టర్ కొరటాలా...? గోపీచందా...?
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర ఎన్టీఆర్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో రూపొందుతున్న నాన్నకు ప్రేమతో...చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 8న రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. శ్రీమంతుడు డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ మూవీ ఓ చేయనున్నారని... ఈ చిత్రాన్ని శ్రీమంతుడు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లే నిర్మించనున్నట్టు ప్రచారం జరిగింది.ఈ చిత్రాన్ని జనవరిలో ప్రారంభించనున్నట్టు వార్తలు వచ్చాయి.
అయితే మురుగుదాస్ కథ-స్ర్కీన్ ప్లేతో మలినేని గోపీచంద్ దర్శకత్వంలో దిల్ రాజు ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని ఎన్టీఆర్ తో ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దీంతో ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ కొరటాలతో ఉంటుందా..? లేక మలినేని గోపీచంద్ తో ఉంటుందా..? అనేది ఆసక్తిగా మారింది. ఈ రెండింటిలో ఏ సినిమా ముందు స్టార్ట్ చేస్తారు..? లేక రెండు సినిమాలు ఓకేసారి స్టార్ట్ చేస్తారా..? క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments