ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ డైరెక్టర్ కొరటాలా...? గోపీచందా...?

  • IndiaGlitz, [Tuesday,September 29 2015]

యంగ్ టైగ‌ర ఎన్టీఆర్ ప్ర‌స్తుతం సుకుమార్ డైరెక్ష‌న్ లో రూపొందుతున్న నాన్న‌కు ప్రేమ‌తో...చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ సినిమాని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 8న రిలీజ్ చేయ‌నున్నారు. ఇదిలా ఉంటే.. శ్రీమంతుడు డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌ డైరెక్ష‌న్ లో ఎన్టీఆర్ మూవీ ఓ చేయ‌నున్నార‌ని... ఈ చిత్రాన్ని శ్రీమంతుడు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ వాళ్లే నిర్మించ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది.ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రిలో ప్రారంభించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

అయితే మురుగుదాస్ క‌థ‌-స్ర్కీన్ ప్లేతో మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని ఎన్టీఆర్ తో ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. దీంతో ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ కొర‌టాల‌తో ఉంటుందా..? లేక‌ మ‌లినేని గోపీచంద్ తో ఉంటుందా..? అనేది ఆస‌క్తిగా మారింది. ఈ రెండింటిలో ఏ సినిమా ముందు స్టార్ట్ చేస్తారు..? లేక రెండు సినిమాలు ఓకేసారి స్టార్ట్ చేస్తారా..? క‌్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

More News

సైజ్ జీరో వాయిదా ప‌డుతుందా..?

అందాల తార అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన‌ చిత్రం సైజ్ జీరో. ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కేంద్రుడు త‌న‌యుడు ప్ర‌కాష్ కొవెల‌మూడి తెర‌కెక్కించారు.

'రోబో2'కి టెక్నికల్ టీమ్ కుదిరింది

సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘రోబో’, ‘శివాజీ’ చిత్రాలు మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.

మహేష్ తో సినిమా నిర్మిస్తున్న డైరెక్టర్ ఎవరు...?

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం బ్రహ్మోత్సవం చిత్రంలో నటిస్తున్నారు.

విక్రమ్ సినిమా ఆడియో రిలీజ్ డేట్..

ఐ’ చిత్రం తర్వాత చియాన్ విక్రమ్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ‘పత్తు ఎన్రదు కుళ్ళ’ సినిమా చేస్తున్నాడు.

అఖిల్ ను ప‌రిచ‌యం చేయ‌నున్న ర‌జ‌నీ..?

అక్కినేని వంశం నుంచి వ‌స్తున్న మూడోత‌రం యువ కెర‌టం అఖిల్. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 22న అఖిల్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నాడు.