గోపీచంద్ నెక్ట్స్ మూవీ టైటిల్ ఫిక్స్..
Send us your feedback to audioarticles@vaarta.com
గోపీచంద్ హీరోగా ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం సౌఖ్యం. ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ నెల 24న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే...గోపీచంద్ నెక్ట్స్ మూవీకి అంతా రెడీ అయ్యింది. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తనయుడు ఎ.ఎం. జ్యోతిక్రిష్ణ దర్శకత్వంలో గోపీచంద్ ఓ సినిమా చేయనున్నారు. ఈ చిత్రానికి ఆక్సిజన్ అనే టైటిల్ ఫిక్స్ చేసారు.
ఈ చిత్రాన్ని శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ బ్యానర్ పై ఐశ్వర్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన రాశి ఖన్నా నటిస్తుంది. ఈ క్రేజీ మూవీలో జగపతిబాబు ఓ ముఖ్యపాత్ర పోషిస్తుండడం విశేషం. గతంలో గోపీచంద్, జగపతిబాబు కాంబినేషన్ లో రూపొందిన లక్ష్యం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. మళ్లీ ఇప్పుడు గోపీచంద్, జగపతి కలయికలో రానున్న ఆక్సిజన్ కూడా విజయం సాధిస్తుందని ఆశిద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com