గోపీచంద్ తదుపరి డైరెక్టర్ ఎవరంటే...?

  • IndiaGlitz, [Wednesday,December 27 2017]

టాలీవుడ్ యాక్ష‌న్ హీరో గోపీచంద్ హీరోగా ప్ర‌స్తుతం చ‌క్రి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోంది. కె.కె.రాధామోహ‌న్ ఈ చిత్రానికి నిర్మాత‌. త్వ‌ర‌లోనే గోపీచంద్..వీరుపోట్ల ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్నాడు. రీసెంట్‌గా గోపీచంద్‌ను క‌లిసిన వీరుపోట్ల లైన్ వినిపించాడ‌ట‌. ఆయ‌న‌కు లైన్ బాగా న‌చ్చింది. సినిమా చేస్తాన‌ని అన్నాడ‌ట‌.

ఇప్పుడు వీరుపోట్ల సినిమా క‌థ‌కు తుది మెరుగులు దిద్దుతున్నాడు. బిందాస్‌, ర‌గ‌డ‌, దూసుకెళ్తా వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ను తెర‌కెక్కించిన వీరుపోట్ల ఈసారి ఎదేని కొత్త జోన‌ర్‌లో సినిమా తీస్తాడా ? లేదా త‌మ రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ ఫార్మేట్ జోన‌ర్ మూవీ చేస్తాడా? చూడాలి.