దీపావళికి వస్తున్న గోపీచంద్..!
Send us your feedback to audioarticles@vaarta.com
చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు లతో సక్సెస్ ఫుల్ మాస్ మూవీస్ అందించిన మాస్ డైరెక్టర్ బి.గోపాల్ ఇప్పుడు గోపీచంద్ తో ఓ మూవీ చేస్తున్నారు. గోపీచంద్ - బి.గోపాల్ కాంబినేషన్ రూపొందే యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను జయ బాలాజీ రియల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన అందాల తార నయనతార నటిస్తుంది. ఈ భారీ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే...ఈ మూవీ టైటిల్ & ఫస్ట్ లుక్ ను దీపావళికి రిలీజ్ చేయనున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత తాండ్ర రమేష్ మాట్లాడుతూ...గోపీచంద్, నయనతార, బి.గోపాల్ కాంబినేషన్లో ఈ మూవీ నిర్మిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీపావళికి టైటిల్ & ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఆడియోను నవంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇక చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేయనున్నాం. క్లైమాక్స్ మినహా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ఈ చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నాం. ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, ప్రకాస్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రకథను వక్కంతం వంశీ అందించగా సంభాషణలను అబ్బూరి రవి అందిస్తున్నారు. టాప్ ఆర్టిస్టులు & టెక్నీషియన్స్ తో రూపొందిస్తున్న ఈ చిత్రం అందర్ని ఆకట్టుకునేలా ఉంటుంది అన్నారు.
గోపీచంద్, నయనతార, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, అభిమన్యు సింగ్, చలపతిరావు, ఉత్తేజ్, జయప్రకాష్ రెడ్డి, ఫిరోజ్ అబ్బాసి, రమాప్రభ, సురేఖవాణి, సన, సంధ్యజనక్, మధునందన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్ - మణిశర్మ, స్టోరీ - వక్కంతం వంశీ, డైలాగ్స్ - అబ్బూరి రవి, ఫైట్స్ - కణ్ణల్ కన్నన్, సినిమాటోగ్రఫీ - బాల మురుగన్, ఎడిటింగ్ - కోటగిరి వెంటేశ్వరరావు, ఆర్ట్ - నారాయణరెడ్డి, నిర్మాత - తాండ్ర రమేష్, డైరెక్టర్ - బి.గోపాల్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com