Korameenu: 'కోరమీను' టీజర్ విడుదల చేసిన గోపీచంద్ మలినేని
Send us your feedback to audioarticles@vaarta.com
ఆనంద్ రవి కథానాయకుడిగా ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పెళ్లకూరు సమన్య రెడ్డి నిర్మిస్తున్న సినిమా 'కోరమీను'. స్టోరీ ఆఫ్ ఇగోస్ అనేది కాప్షన్. శ్రీపతి కర్రి దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ట్విట్టర్ ద్వారా శనివారం సినిమా టీజర్ విడుదల చేశారు.
'మీసాల రాజు గారికి మీసాలు తీసేశారంట! ఎందుకు?' అంటూ కొన్ని రోజుల నుంచి వినూత్నంగా సినిమా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. టీజర్లో ఆ మీసాలు రాజు ఎవరో చెప్పారు. ''ఈ రోజు జాయిన్ అయిన మీసాల రాజు గారికి జాలరిపేటలో నిన్న రాత్రి ఎవరో మీసాలు తీసేశారని సమాచారం'' అని న్యూస్ యాంకర్ వాయిస్ వినిపిస్తుంటే... స్క్రీన్ మీద మీసాల రాజుగా శత్రును చూపించారు.
'డబ్బుకు ఎక్కువ పవర్ అనుకుంటారు గానీ అసలైన పవర్ భయానిదేరా' అని హరీష్ ఉత్తమన్ చెప్పే డైలాగ్, 'ఇది జాలరిపేట. డబ్బున్నోడు, డబ్బు లేనోడు... అంతే!' అని హీరోయిన్ కిషోరీతో ఆనంద్ రవి చెప్పే మాట... వాళ్ళ క్యారెక్టరైజేషన్లు చెప్పేలా ఉన్నాయి. ఆనంద్ రవి నటనలో ఈజ్ ఉంది. జాలరిపేట యువకుడి పాత్రలో ఆయన ఒదిగిపోయారు. టీజర్ చివర్లో గిరిధర్, ఇమ్మాన్యుయేల్ సీన్‌తో సినిమాలో కామెడీ కూడా ఉందని హింట్ ఇచ్చారు.
దర్శకుడు శ్రీపతి కర్రి మాట్లాడుతూ.. ''టీజర్ విడుదల చేసిన గోపీచంద్ మలినేని గారికి థాంక్స్. కథ విషయానికి వస్తే... జాలరిపేట అనే మత్స్యకారుల కాలనీకి కొత్తగా వచ్చిన పోలీస్ మీసాల రాజు మీసాలు ఎవరు తీసేశారనేది ఆసక్తికరం. ఓ డ్రైవర్, అహంకారంతో కూడిన, బాగా డబున్న అతని యజమాని, వైజాగ్‌లో శక్తివంతమైన పోలీసు - ఈ ముగ్గురి పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. మంచి కంటెంట్ తో వస్తున్న చిత్రమిది. అందరికీ నచ్చుతుంది'' అని అన్నారు.
కోటి పాత్రలో ఆనంద్ రవి, కరుణగా హరీష్ ఉత్తమన్, మీసాల రాజు పాత్రలో శత్రు, మీనాక్షిగా కిషోరీ దత్రక్, దేవుడు పాత్రలో రాజా రవీంద్ర, సీఐ కృష్ణ పాత్రలో గిరిధర్, ముత్యంగా 'జబర్దస్త్' ఇమ్మాన్యుయెల్, సుజాతగా ఇందు కుసుమ, వీరభద్రమ్ పాత్రలో ప్రసన్న కుమార్, కరుణ అసిస్టెంట్ పాత్రలో ఆర్కే నాయుడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి పీఆర్వో : నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి బియాండ్ మీడియా, స్టైలిష్: పూజ శేఖర్, ఎడిటర్: విజయ్ వర్ధన్ కె, పాటలు: అనంత నారాయణన్ ఏజీ, ప్రొడక్షన్స్ డిజైనర్: ముసి ఫణి తేజ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పవన్ కుమార్ జన స్వామి, సినిమాటోగ్రాఫర్: కార్తీక్ కొప్పెర, సౌండ్ డిజైన్: సాయి వర్మ ముదునూరి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: సిద్ధార్థ్ సదాశివుని, ప్రొడక్షన్ హౌస్: ఫుల్ బాటిల్ ఎంటర్టైన్మెంట్స్, స్టోరీ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ : ఆనంద్ రవి, డైరెక్టర్: శ్రీపతి కర్రి, నిర్మాత : పెళ్లకూరు సమన్య రెడ్డి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments