‘క్రాక్’ నిర్మాతపై దర్శకుడు గోపిచంద్ మలినేని ఫిర్యాదు
Send us your feedback to audioarticles@vaarta.com
‘క్రాక్’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పనక్కర్లేదు. దర్శకుడు గోపిచంద్ మలినేని, మాస్ మహరాజ్ రవితేజల కాంబో ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టింది. లాక్డౌన్ తర్వాత అతి పెద్ద విజయంగా ఈ సినిమాను చెప్పవచ్చు. రవితేజకు మంచి కమ్ బ్యాక్‌ను అందించింది ఈ చిత్రం. అయితే ఈ సినిమా మంచి సక్సెస్ సాధించినప్పటికీ దర్శక, నిర్మాతల మధ్య ఆర్థిక సమస్యలైతే అలాగే ఉన్నాయి. తాజాగా దీనిపై గోపిచంద్ మలినేని, నిర్మాత మధుపై నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు.
తన రెమ్యునరేషన్‌ను ఇప్పటి వరకూ పూర్తిగా క్లియర్ చేయలేదని.. బకాయి మొత్తాన్ని చెల్లించేందుకు నిర్మాత ఠాగూర్ మధు నిరాకరిస్తున్నారని ఫిర్యాదులో గోపిచంద్ మలినేని పేర్కొన్నారు. గోపిచంద్ మలినేనికి తన రెమ్యూనరేషన్ మొత్తం పొందేందుకు మరో ఆప్షన్ లేకపోవడంతో ఆయన నిర్మాతల మండలిని ఆశ్రయించినట్టు తెలుస్తోంది. ఠాగూర్ మధు, గోపిచంద్‌ల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఇంకా గోపిచంద్‌కు రూ.30 నుంచి రూ.50 లక్షలు రావలిసి ఉందని తెలుస్తోంది.
అయితే ఈ వివాదం విషయమై ఠాగూర్ మధు వర్షన్ మరోలా ఉంది. ఆయన నిర్దేశించిన బడ్జెట్ పరిమితులన్నింటినీ మీరి గోపిచంద్ ఈ సినిమాను రూపొందించారని ఆయన చెబుతున్నారు. ప్రారంభంలో గోపిచంద్ మలినేని ‘క్రాక్’ సినిమాను రూ.15 కోట్ల బడ్జెట్లో పూర్తి చేసేందుకు అంగీకరించారని.. అయితే దాని బడ్జెట్ మాత్రం రూ.25 కోట్లు అయ్యిందని ఠాగూర్ మధు తెలిపారు. బడ్జెట్ పరిమితులను మీరినందును అతనికి ఇవ్వవలిసిన మొత్తాన్ని చెల్లించడం లేదు. మరి కౌన్సిల్ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout