గోపిచంద్ హీరోగా 'మహాప్రస్థానం'

  • IndiaGlitz, [Friday,October 23 2015]

ప్రస్తుతం సౌఖ్యం' చిత్రంతో బిజీగా ఉన్న హీరో గోపిచంద్ క్రిస్మస్ రోజున మన ముందుకు రానున్నాడు. ఈ సినిమా తర్వాత దేవాకట్టా దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఆ చిత్రమే మహా ప్రస్థానం'. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు.

ప్రపంచంలో జరిగే మర్డర్లు, మోసాలు, బంధాలు, అనుబంధాలు అన్నింటిని పెంచేది, తుంచేది డబ్బు మాత్రమే. ఏడేళ్ల వయసులో ఈనిజాన్ని తెలుసుకుని కరెన్సీ వెనుక పరెగెత్తాను. ఎవరికీ అందని వేగం, కసి కరెన్సీ వెనుక ప్రయాణించాను. మర్డర్లు, మోసాలు చేశాను. జె.డి.ఆర్ అంటే మీ జీవితాన్ని శాసించే నిరంకుశ శక్తి. ఐయామ్ కరెప్ట్, క్రిమినల్ అండ్ ఐయామ్ ది విలన్ అంటూ వచ్చే వాయిస్ ఓవర్ ఉండే టీజర్ ప్రస్తుతం టీజర్ సందడి చేస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయట.