వినాయక్ దర్శకత్వంలో గోపీచంద్.....
Send us your feedback to audioarticles@vaarta.com
సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150తో బిజీగా ఉన్నాడు. సినిమా సంక్రాంతి బరిలోకి దిగనుంది. ఈ సినిమా కాగానే వినాయక్ ఏ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడో ఇంకా కన్‌ఫర్మ్ కాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం వినాయక్ గోపీచంద్‌ను డైరెక్ట్ చేయనున్నాడట. సాహసం శ్వాసగా సాగిపో సినిమా నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి గోపీచంద్‌తో సినిమా చేయడానికి డేట్స్ తీసుకున్నాడట. ఈ సినిమాను వినాయక్ దర్శకత్వంలో రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. అయితే గోపీచంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తికాగానే వినాయక్, గోపీచంద్ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని అంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com