నెగటివ్ షేడ్స్ లో హీరో గోపీచంద్...

  • IndiaGlitz, [Tuesday,May 30 2017]

హీరోగా తెలుగు ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ త‌ర్వాత జ‌యం, నిజం, వ‌ర్షం వంటి చిత్రాల్లో విల‌న్‌గా న‌టించి మెప్పించాడు. త‌ర్వాత హీరోగా రీ ఎంట్రీ ఇచ్చి మంచి విజ‌యాల‌నే అందుకున్నాడు. ఇప్పుడు గోపీచంద్ మ‌ళ్ళీ నెగ‌టివ్ షేడ్స్ ఉన్న‌క్యారెక్ట‌ర్‌లో క‌న‌ప‌డ‌బోతున్నాడు.

అంటే మ‌ళ్ళీ విల‌న్‌గానా అంటే అవుననే చెప్పాలి..అస‌లు విష‌యంలోకి వెళితే సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో గోపీచంద్, హ‌న్సిక జంట‌గా న‌టిస్తున్న చిత్రం 'గౌత‌మ్‌నంద‌'. ఈ సినిమాలో గోపీచంద్ డబుల్ రోల్ చేస్తున్నాడ‌ట‌. అందులో ఓ క్యారెక్ట‌ర్ నెగ‌టివ్ షేడ్స్‌లో క‌న‌ప‌డుతుందన్న‌మాట‌. మ‌రి గౌత‌మ్ నందలో నెగ‌టివ్ షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్‌లో గోపీచంద్ ఎలా మెప్పిస్తాడో చూడాల్సిందే...